మాజీ జెడ్.పి చైర్మెన్ నామన రాంబాబు
విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, Amalapuram:
పేదలకడుపు కొట్టి ఏంత ఆనందం పొందుతున్నావ్ జగన్ మోసపురెడ్డి .
మాజీ జెడ్.పి చైర్మెన్ నామన రాంబాబు
అంబాజీపేట ( విశ్వం వాయిస్ ప్రతినిధి )
అన్నపూర్ణగా పేరు గాంచిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ పేదలకు పట్టెడన్నం పెడుతుంటే అధికార పార్టీ నేతలు చూసి ఓర్వలేకపోతున్నారని
2019 లో వై.సి.పి అధికారంలోకి రాగానే పేదవాడిపై కక్ష గట్టి వారు పట్టెడు అన్నం తినడం ఇష్టం లేని వై.సి.పి ప్రభుత్వం అన్నా క్యాంటీన్లను రద్దు చేసి నిరుపేదల కడుపు కొట్టిన ఘనత ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికే దక్కుతుందని తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిషత్ మాజీ చైర్మెన్ పి .గన్నవరం నియోజకవర్గ కోకన్వినర్ నామన రాంబాబు అన్నారు. కుప్పం లాంటి అనేక ప్రాంతాల్లో అన్నా క్యాంటీన్లపై జరిగిన నిరంకుశ దాడికి నిరసనగా డా.బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా లో పి.గన్నవరం నియోజకవర్గం అంబాజీపేట మండలం మాచవరం బస్టాండ్ ఎదురుగా మండల తెలుగుదేశం పార్టీ అద్యక్ష, ప్రదాన కార్యదర్శులు దంతులూరి శ్రీను రాజు ,గూడాల పణి , తెలుగుదేశం పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఒక్క రోజు అన్నా క్యాంటీన్ శుక్రవారం నిర్వహించారు. ఈకార్యక్రమానికి ముఖ్య అతిదులుగా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి, జెడ్.పి మాజీ చైర్మెన్ పి.గన్నవరం నియోజకవర్గ కో కన్వినర్ నామనరాంబాబు , రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి, తిరుమల తిరుపతి దేవస్థాన మాజీ పాలక మండలి సభ్యులు శ్రీ డొక్కా జగన్నాథం (నాథ్ బాబు) ఇతర తెదేపా నేతలు భోజనం వడ్డించి పేదవారికి భోజనం పంపిణీ చేసి వారి ఆకలిని తీర్చారు. ఈసందర్భంగా పలువురు మాట్లాడుతూ ఒక్క ఛాన్స్ పేరుతో జనాల్ని మభ్యపెట్టి రాష్ట్రాన్ని జగన్ మోసపు రెడ్డి ముంచేశాడని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు . పంటలతో పచ్చగా ఉన్న రాష్ట్రంలో కుల, మత, ప్రాంతీయ చిచ్చులు రగిలించి జగన్ జగన్ చలి కాచుకుంటున్నాడని ఈ రాష్ట్రంలో ప్రభుత్వానికి ప్రతిపక్ష పార్టీ నేతలను, ప్రశ్నించిన అదికారును దొంగ కేసులు బనాయంచి వేధించడం మంత్రులతో బూతులు తిట్టించడం తప్ప జగన్ గత మూడేళ్ళ పాలనలో రాష్ట్రానికి భవిష్యత్తులో ఉపయోగపడే ఒక్క మంచి పనీ చేసిన దాఖలాలు లేవని నామన రాంబాబు అన్నారు. జగన్ పాలనలో నిరుద్యోగం, పేదరికం, విరీతంగా పెరిగిపోయిందని పేద వారు కుటుంబతో పట్టెడు అన్న తినే యోగ్యత లేదు అన్నట్లుగా నిత్యావసర సరుకు దరలు విరీతంగా పెంచేసి పేదవాడిపై జగన్ మోసపురెడ్డి కక్ష తీర్చుకుంటున్నారని పేదవారంటే జగన్కు కిట్టదని ఈ సందర్భంలో అన్నా క్యాంటీన్లు ఉండి ఉంటే కనీసం పేదవాడికి పట్టెడన్నం తిని ఆకలి తీర్చుకునేవారని వారు అన్నారు. జగన్ కాకుండా మరో ముఖ్యమంత్రి ఎవరైనా తమిళనాడు మాదిరిగా అన్నా క్యాంటీన్ల పేరు మార్చి అయినా పథకాన్ని పేదప్రజలకోసం కొనసాగించి ఉందురని, ఫ్యాక్షన్ మనస్తత్వం ముఠా రాజకీయాకు అలవాటు పడ్డ వ్యక్తి కనుకే ఈ పథకాన్ని నిలిపి వేసాడని అన్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం గెలిచిన వెంటనే అన్నా క్యాంటీన్లను తిరిగి పునఃప్రారంబిస్తామని నామన రాంబాబు డొక్కా జగన్నాథ అన్నారు. ఈకార్యక్రమంలో నేదునూరి వీర్రాజు, బొంతు పెదబాబు , గణపతి వీర్రాఘవులు , అరిగెల బలరామ మూర్తి , దువ్వూరి సురేష్ , అయ్యగారి సూరిబాబు, మట్టపర్తి బారతి , చిన్నం బాలవిజయరావు, నాగాబత్తుల వెంకట సుబ్బారావు , గుమ్మడి వెంకటేశ్వరరావు , పెదపూడి రాము, జాలెం సుబ్బారావు , గంగుమళ్ళ వీరబద్రరావు , పెదపూడి శ్రీనివాసరావు , గెల్లా అశోక్, బడుగు బాస్కర జోగేష్ , ఎన్టీఆర్ యువసేన అధ్యక్షులు వక్కలంక బుల్లియ్య , వివిద గ్రామాల సర్పంచ్ లు, ఎంపీటీసీలు అధిక సంఖ్యలో పార్టీ నాయకులు కార్యకర్తలు,
తదితరులు పాల్గొన్నారు.