విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, ఉప్పలగుప్తం, న్యూస్ రిపోర్టర్:
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, ఉప్పలగుప్తం మండలం. మండలంలో గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు చేలు వాగులు మాదిరిగా తయారయ్యాయి నీరు రోడ్లపై చేరి చెరువులను తలపిస్తున్నాయి నీటితో నిండిన రోడ్లపై ప్రయాణించడానికి వాహనదారులు, ఆటోలు మరియు విద్యార్థిని విద్యార్థులు ప్రయాణికులు, ఈ రోడ్లపై ప్రయాణం చేయడానికి నానా ఇబ్బందులు పడుతున్నారు అంతేకాక వర్షం నీరు రోడ్డుపై నిలిచిపోవడంతో,రోడ్డుపై గుంతలు,గుంతలుగా ఏర్పడి రాకపోకలకు అనేక ఇబ్బందులు ఏర్పడ్డాయి.అంతేకాక వాహనదారులుగుంత ఎక్కడో నీ రోడ్డు ఎక్కడో తెలీక ప్రమాదాలకు గురవుతున్నారు. నీరు మురికి కాలువ లోకి వెళ్లే దారి లేక ఎక్కడ నీరు అక్కడే స్తంభించిపోయి ఉండటం వల్ల రోడ్డంతా బురదతో నిండిపోయింది. నాయకులు, ప్రజాప్రతినిధులు మా పరిస్థితిని అర్థం చేసుకొని త్వరగా నీటిని మురికాళ్ళకు పంపే మార్గం చూపించి పాడైన రోడ్డును మరమ్మత్తులు చేయించవలసిందిగా స్థానిక ప్రజలు, వాహనదారులు, విద్యార్థినీ విద్యార్థులు అటు అధికారులను ఇటు ప్రజాప్రతినిధులను కోరుచున్నారు.మా యొక్క బాధలు తీరవా అన్నట్టు బాధతో ఎదురుచూస్తున్నారు.