విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, అమలాపురం పట్టణం:
చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకు ఆఫీసర్స్ అసోసియేషన్ వారు మొగళ్లమూరులో గౌ|| అమలాపురం పార్లమెంట్ సభ్యులు శ్రీమతి చింతా అనురాధ గారిని మర్యాదపూర్వకంగా కలిసి వారి సమస్యలపై వినతి పత్రాన్ని అందజేయడం జరిగింది
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలోని మారుమూల ప్రాంతాల్లోని నిరుపేదలకు ఆర్థిక వనరులను అందుబాటులోకి తీసుకురావాలనే సదుద్దేశంతో 1976, ఆర్ఆర్బీ చట్టంతో కేంద్ర ప్రభుత్వం 50 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 15 శాతం, కమర్షియల్ బ్యాంకు 35 శాతం వాటాతో రీజనల్ రూరల్ బ్యాంకుల స్థాపన జరిగిందనీ, దేశంలో 1987 లో 196 ఆర్ఆర్బీలు ఉండగా, 2005 నుండి దశల వారీగా వాటిని వేరే బ్యాంకులతో కలుపుతూ తగ్గించే ప్రయత్నం జరుగుతుందని, ప్రస్తుతం 43 ఆర్ఆర్బీలు మాత్రమే ఉన్నాయని, 2015/16 నుండి ఆర్ఆర్బీల ప్రైవేటీకరణ దిశగా వాటాను మార్కెట్లో అమ్ముకునేలా చట్టాన్ని తెచ్చారని, ఆ చర్యలను తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని, ప్రస్తుతం 34,359 కోట్ల రూపాయల లాభాలలో ఉన్నాయని, గత ఆర్థిక సంవత్సరంలో 3219 కోట్ల రూపాయల లాభాలను ఆర్ఆర్బీలు అర్జించాయని, ఎక్కడైనా నష్టాల్లో కొన్ని ఆర్ఆర్బీలు ఉన్నప్పటికీ అది వ్యవసాయానికి పేద రైతులకు అండగా రుణాలు ఇచ్చినప్పుడు, ప్రకృతి విపత్తుల వల్ల మరియు రాజకీయ రుణ మాఫీల వల్ల మాత్రమేనని, దేశంలోని మారుమూల ప్రాంతాల్లోని నిరుపేదలకు, రైతులకు, సామాన్యులకు ఆర్థిక వనరులు అందేలా కృషి చేస్తున్న ఆర్ఆర్బీలను ప్రవెటీకరణ పేరుతో నిర్వీర్యం చేసే చర్యలను తీవ్రంగా వ్యతిరేకిస్తూ AIRBEA (అఖిల భారత రూరల్ బ్యాంకుల ఉద్యోగస్తుల సంఘం) చేపట్టనున్న ఆందోళనకు ఎంపీ గారిని మద్దతు కోరుతూ సమస్యను గౌరవ సీఎం శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకువెళ్లాలని అలాగే పార్లమెంట్ లో ప్రస్తావించాలని కోరగా ఎంపీ గారు సానుకూలంగా స్పందించడం జరిగింది