విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, ప్రత్తిపాడు:
ప్రత్తిపాడు మండల న్యాయ సేవ సంస్థ ఆధ్వర్యంలో ఈ రోజు ఉదయం 9 గంటలకి రాచపల్లి గ్రామ పంచాయితీ కార్యాలయంలో జరిగిన న్యాయ అవగాహన సదస్సులో ప్రత్తిపాడు కోర్టు మెజిస్ట్రేట్ కాటం భాను ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.గ్రామంలో ప్రజలు అందరు చట్టాల పై అవగాహన కలిగి ఉండాలని, పేద ప్రజానీకానికి అండగా మండల న్యాయ సంస్థ ద్వారా ఉచితం గా న్యాయ సహాయం పొందవచ్చని చెబుతూ, ఈ నెల 12 న జరుగుతున్న మెగా లోక్ అదాలత్ ఉపయోగించుకోవాలని చెప్పారు.గ్రామాల్లో న్యాయ అవగాహన సదస్సులు నిర్వహించడం వల్ల ప్రజలకు చట్టాల పట్ల అవగాహన కలుగుతుందన్నారు.చట్టాలు తెలుసుకున్నట్లయితే ప్రజలు వివేకంగా వ్యవహరిస్తారని, న్యాయస్థానాలను ఆశ్రయిస్తే కచ్చితంగా న్యాయం జరుగుతుందని ఆయన అన్నారు. ప్రజలందరూ ఇటువంటి కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు.రాజ్యాంగం పట్ల ఆయన అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు బుగత శివ ,కార్యదర్శి రాజాల చిట్టిబాబు ,రాచపల్లి సర్పంచ్ లో వ లక్ష్మి ,న్యాయవాదులు మల్లేశ్వరరావు , సుజన, ప్రత్తిపాడు ఏ.ఎస్ఐ. లు పాల్గొన్నారు.