విశ్వంవాయిస్ న్యూస్, దేవరపల్లి:
ఇటీవల ప్రతిష్టాత్మకంగా జరిగిన గుజరాత్ ఎన్నికలలో బి.జె.పి 1995 నుండి విజయం సాధిస్తూ మరల ఏడవసారి తిరిగి అధికారంలోకి రావడం ఒక రికార్డ్ అని తూర్పుగోదావరి జిల్లా ఎస్సీ మోర్చ అధ్యక్షుడు దున్న సుమన్ బాబు ప్రశంసించారు.ఇది మోడీ విజయం అని 182 సీట్లకు గాను 156 సీట్లు అనగా 90% నియోజకవర్గాలలో గెలవడం దేశవ్యాప్తంగా మోడీ చేస్తున్న అభివృద్ధికి నిదర్శనమని,మోడీని ఒక్క దేశ నాయకుడిగానే కాక ప్రపంచ నాయకుడిగా దేశ ప్రజలు కీర్తిస్తున్నారని,ఈ విజయాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఆంధ్రప్రదేశ్ లో అధికారం సాధించాలనే లక్ష్యంతో బి.జె.పి నాయకులు,కార్యకర్తలు నిరంతర కృషి చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో పలువురు మండల ఎస్సీ మోర్చా నాయకులు తదితర కార్యకర్తలు పాల్గొన్నారు.