విశ్వంవాయిస్ న్యూస్, రాజమహేంద్రవరం సిటీ:
జనవరి 9వ తేదీ సోమవారం జిల్లా, డివిజన్, క్షేత్ర స్థాయి స్పందన కార్యక్రమం యధాతధంగా జరుగుతుందని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.జిల్లా, డివిజన్, మునిసిపల్, మండల స్థాయి లో న జనవరి 9 న జరిగే స్పందన కార్యక్రమం లో అర్జి దారులు తమ స్పందన అర్జీలు అందించ వొచ్చు అని తెలిపారు. ప్రజలు వ్యయ ప్రయాసలకోర్చి జిల్లా కేంద్రానికి కాకుండా, వారి పరిధిలోని గ్రామ/ వార్డు సచివాలయాల్లో , మండల పరిధిలో అర్జీలు అందచేయాలని తెలిపారు.జిల్లా కలెక్టరేట్ కు ఆర్టీసి బస్టాండ్ నుంచి ఉదయం 9 ల నుంచి మ.1 వరకు ఉచిత బస్సు సౌకర్యం కలదని పేర్కొన్నారు.