Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

శెట్టిబలిజ సంఘీయులు అందరూ ఒక తాటిపై కలిసి ముందుకు సాగాలి

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

ఇటీవల పదవులు పొందిన జాతి బిడ్డలను సత్కరించిన ఎం పి మార్గాని భారత్ రామ్, పాలిక శ్రీను, సంఘ పెద్దలు

విశ్వంవాయిస్ న్యూస్, రాజమహేంద్రవరం:

దొమ్మేటి వెంకటరెడ్డి విగ్రహాలను గ్రామగ్రామాన ఏర్పాటుకు కృషి

– శెట్టిబలిజ జాతిపిత దొమ్మేటి వెంకటరెడ్డి 170వ జన్మదిన వేడుకలు పాలిక శ్రీను అధ్వర్యంలో

– ఇటీవల పదవులు పొందిన జాతి బిడ్డలను సత్కరించిన ఎం పి

రాజమహేంద్రవరం,విశ్వంవాయిస్ న్యూస్:
శెట్టిబలిజ జాతిపిత స్వర్గీయ దొమ్మేటి వెంకటరెడ్డి 170వ జన్మదిన వేడుకలు స్థానిక హోటల్ ఆనంద్ రీజెన్సీలో ఎంపీ మార్గాని భరత్ రామ్ సౌజన్యంతో,శెట్టి బలిజ గౌడ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పాలిక శ్రీను ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యులు మార్గాని భరత్ రామ్,మార్గాని నాగేశ్వరరావు,బుడ్డిగ శ్రీను ఇతరులు పాల్గొని ముందుగా దొమ్మేటి వెంకటరెడ్డి చిత్రపటానికి నివాళులర్పించారు.పార్లమెంట్ సభ్యులు మార్గాని భరత్ రామ్ మాట్లాడుతూ సంఘ సభ్యులందరూ కలిసి ఒకే తాటిపై కలిసి ముందుకు సాగాలని తద్వారా చట్టసభల్లో మన సంఘ సభ్యులకు సరైన అవకాశాలు లభిస్తాయని పార్టీలకతీతంగా ప్రతి ఒక్క సంఘ సభ్యులు కృషి చేయాలని పేర్కొన్నారు.పాలిక శ్రీను మాట్లాడుతూ గీత కులాలు ఉన్నటువంటి గ్రామంలో ఈరోజు శెట్టిబలిజ జాతిపిత స్వర్గీయ దొమ్మేటి వెంకటరెడ్డి చిత్రపటాల దాదాపు 300 గ్రామాలలో అందించి జయంతిని ఘనంగా నిర్వహించామని, అదేవిధంగా గీత కులాలు ఉన్నటువంటి గ్రామాలలో వెంకటరెడ్డి విగ్రహాల ఏర్పాటుకు మరియు గీత కులాల సంఘ అభివృద్ధికి కృషి చేస్తానని తెలియజేశారు.
గీత కులాల సంఘ పెద్దలు,పాలిక శ్రీను ఆధ్వర్యంలో గవర్నమెంట్ అడ్వకేట్లకు ఇటీవల ఎన్నుకోబడిన సంఘ సభ్యులు ది రాజమండ్రి బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్
ఇళ్ల శివప్రసాద్,ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఫోక్సో కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ పితాని శ్రీనివాస్,కాకినాడ ఏ జి పి గెద్దాడ వెంకటేశ్వరరావు,రాజమండ్రి అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ మారిశెట్టి వెంకటేశ్వర రావు,గవర్నమెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పిల్లి శ్రీనివాస్,అమలాపురం ఏ.జి.పి వనుము చంద్రశేఖరరావు,రామచంద్ర పురం ఏ.జి.పి పిల్లి మురళీ మోహన్ వెంకటరమణ,దిఆర్యాపురం కోపరేటివ్ బ్యాంక్ డైరెక్టర్స్ పెంకె సురేష్ కుమార్,
మార్గాని సురేష్,రాయుడు గణేష్,ది ఇన్నిస్ పేట కోపరేటివ్ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్ గేడి అన్నపూర్ణరాజు లకు పార్లమెంట్ సభ్యులు మార్గాని భరత్ రామ్ చేతుల మీదగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమం రాష్ట్ర శెట్టిబలిజ గౌడ శ్రీ శయన యాత ఈడిగ సిగిడి కార్పొరేషన్ మాజీ చైర్మన్ పాలిక శ్రీను ఆధ్వర్యంలో నిర్వహించారు, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుండి అధిక సంఖ్యలో సంఘ సభ్యులు పాల్గొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement