పి మల్లవరంలో కౌలు రైతు సంఘం ఆధ్వర్యంలో నిరసన
విశ్వంవాయిస్ న్యూస్, తాళ్ళరేవు:
చలో ఢిల్లీ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి
పి మల్లవరంలో కౌలు రైతు సంఘం ఆధ్వర్యంలో నిరసన
తాళ్ళరేవు, విశ్వం వాయిస్ న్యూస్: తాళ్లరేవు మండలం పి మల్లవరం పంచాయతీ పరిధి గ్రాంట్ గ్రామంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కౌలు రైతు సంఘం ఆధ్వర్యంలో నిరసనలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఏపీ కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఏప్రిల్ 5న జరిగే చలో ఢిల్లీ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఏప్రిల్ 5న కేంద్ర ప్రభుత్వం విధానాలు ఒక్కొక్కటిగా సామాన్యులకు భారంగా మారుతున్నాయని వళ్లు రాజబాబు పేర్కొన్నారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ ఐదుని జరిగే చలో ఢిల్లీ కార్యక్రమంలో రైతు సోదరులందరూ పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. చలో ఢిల్లీ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పోస్టర్ను విడుదల చేశారు .ఈ కార్యక్రమంలో ఆయన వెంట సిపిఎం నాయకులు కౌలు రైతులు పాల్గొన్నారు.