విశ్వంవాయిస్ న్యూస్, అద్దంకి:
అద్దంకి పట్టణంలోని ప్రకాశం జూనియర్ కళాశాల ఆవరణలో ఆసరా మూడో విడత చెక్కులు కంపెనీ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాప్ నెట్ చైర్మన్ మరియు అద్దంకి వైఎస్ ఆర్ సీపీ ఇంచార్జ్ శ్రీ బాచిన కృష్ణ చైతన్య ముఖ్య అతిథిగా హాజరై అద్దంకి పట్టణంలోని ఆసరా లబ్ధిదారులకు చెక్కులు పంచడం జరిగింది.
సందర్భంగా మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో ఇచ్చినటువంటి అన్ని హామీలను కచ్చితంగా అమలు చేస్తున్నటువంటి ఏకైక ప్రభుత్వ వైఎస్ఆర్సిపి అని రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ కొండంత అండగా ఎప్పుడు మీ అన్న C.M జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమానికి అద్దంకి మండలం ఎంపీపీ మండల నాయకులు సచివాలయం ఉద్యోగస్తులు ప్రభుత్వ అధికారులు ఆసరా లబ్ధిదారులు వేల సంఖ్యలో పాల్గొన్నారు