విశ్వంవాయిస్ న్యూస్, అద్దంకి:
అద్దంకి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మేదరమెట్ట సబ్ పోలీస్ స్టేషన్ నందు స్థానిక గుండ్లపల్లి గ్రోత్ సెంటర్ వద్ద మేదరమేట్ట ఎస్సై శివకుమార్ ఆధ్వర్యంలో నో యాక్సిడెంట్ డే కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా వాహనదారులకు రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించి తప్పని సరిగా వాహనం నడిపేటప్పుడు హెల్మెట్ ధరించాలని ఎస్సై సూచించారు.
ఈ సందర్భంగా వాహనాల యెక్క పత్రాలు తనిఖీ చేసి సరైన పత్రాలు లేనటువంటి 40 మంది మీద కేసు నమోదు చేసి వారికి 5600 జరిమానా విధించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మేదరమెట్ల ఏఎస్ఐ మరియు స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.