మాకొద్దు ఈ అవినీతిపరుడైన ఎమ్మెల్యే
విశ్వంవాయిస్ న్యూస్, ఒంగోలు:
ప్రకాశం జిల్లా సంతనూతలపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబుకు నియోజకవర్గంలోని కొందరు నాయకులుతో తీవ్ర వ్యతిరేకత ఎదురవుతుంది.
ఎమ్మెల్యే వ్యతిరేక వర్గమైన కొందరు నాయకులు ఈరోజు స్థానిక ఉప్పుగుండూరు రైల్వే స్టేషన్ వద్ద అవినీతి ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు మాకు వద్దు సమన్వయకర్తే ముద్దు అంటూ పదుల సంఖ్యలో కరపత్రాలు స్థానికంగా వెలుగు చూడటంతో సంతనూతలపాడు నియోజకవర్గ వైసీపీ పార్టీలో ఓకింత గందరగోళ పరిస్థితి నెలకొంది.