విశ్వంవాయిస్ న్యూస్, ఒంగోలు:
వార్షిక తనిఖీలు భాగంగా ప్రకాశం జిల్లా సూపర్డెంట్ ఆఫ్ పోలీస్ శ్రీమతి మల్లికా కర్గే ,
ప్రకాశం జిల్లా జైలును ఆకస్మితంగా సోమవారం సందర్శించారు.
ఈసందర్భంగా ఆమెకు జైలు అధికారులు గౌరవ వందనం సమర్పించారు.
ఎస్పీ మాట్లాడుతూ జైలు భద్రత యొక్క విషయాలపై జైలు అధికారులకు మరియు సెక్యూరిటీ కమిటీ వారికి తగు చూచనలు అందించారు.
అధికారులు ఖైదీలతో ఎప్పటికప్పుడు జాగ్రత్తగా ఉండాలని, ఖైదీలకు క్రమశిక్షణ నెలకొనేలా కార్యక్రమాలకు రూపకల్పన చేయాలని ఎస్పీ సూచించారు.
ఈ కార్యక్రమంలో ఎస్పీ వెంట ట్రైనింగ్ ఐపీఎస్ అంకిత సురాణ, ఏ ఎస్ పి చక్రధర్ రావు పాల్గొన్నార.