విశ్వంవాయిస్ న్యూస్, అద్దంకి:
అద్దంకి నియోజకవర్గం కొరిసపాడు మండలం మేదరమెట్ల జాతీయ రహదారిపై మంగళవారం నాడు ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
వివరాల్లోకి వెళితే గుంటూరు నుంచి ఒంగోలు వైపుగా వెళ్తున్న ఇనోవా కారు మేదరమట్ట జాతీయ రహదారి వద్దకు వచ్చేసరికి, కారు ముందు ప్రయాణిస్తున్న బైకును ఢీ కొట్టి అదుపుతప్పి ఆగి ఉన్న లారీని బలంగా ఢీకొట్టంతో కారులో ప్రయాణిస్తున్న వారికి తీవ్ర గాయాలయ్యాయి.
కారులో మొత్తం నలుగురు ప్రయాణిస్తుండగా ఒకరు మృతి చెందినట్లు , మిగిలిన ముగ్గురికి తీవ్ర గాయాలు అయినట్టు స్థానిక ఎస్సై నాగ శివారెడ్డి తెలిపారు.
క్షతగాత్రుని 108 వాహనం ద్వారా అద్దంకి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి దిగిన సంఘటనపై కేసు నమోదు చేసి విచారించడం జరుగుతుందని ఆయన తెలిపారు.