విశ్వంవాయిస్ న్యూస్, అమలాపురం:
జగనన్న ఆణిముత్యాలు ఎయిడెడ్ పాఠశాలలకు వర్తింపచేయాలి మంత్రికి విజ్ఞప్తి చేసిన ఎమ్మెల్సీ ఐ వి
అమలాపురం టౌన్ వాయిస్ న్యూస్
ప్రభుత్వ విద్యాసంస్థల 10 తరగతి, ఇంటర్ టాపర్ విద్యార్థులకు ప్రోత్సాహంకంగా జగనన్న ఆణిముత్యాలు పేరిట నియోజకవర్గం, జిల్లా, రాష్ట్ర స్థాయిలో ఎస్ ఎస్ సి లో మొదటి మూడు స్థానాల్లో, ఇంటర్ లో ఎంపీసీ, బైపిసి, సీఈసీ,హెచ్ఈసి /ఎంఈ సి లలో మొదటి ర్యాంక్ వారికి సత్కారం, నగదు పురస్కారం. నియోజకవర్గం స్థాయి – ఎస్ ఎస్ సి వారికి 15 వేలు, 10 వేలు, 5 వేలు..ఇంటర్ వారికి ఒక్కరికి 15 వేలు – జిల్లా స్థాయి – ఎస్ ఎస్ సి వారికి 50 వేలు, 30 వేలు, 15 వేలు..ఇంటర్ వారికి ఒక్కరికి 50 వేలు – రాష్ట్ర స్థాయి – ఎస్ ఎస్ సి వారికి 1 లక్ష, 75 వేలు, 50 వేలు..ఇంటర్ వారికి ఒక్కరికి 1 లక్ష. చొప్పున రాష్ట్ర ప్రభుత్వం జిల్లా పరిషత్తు, మండల పరిషత్, మున్సిపల్, గురుకులాలు మోడల్ స్కూల్స్, ప్రభుత్వ విద్యాసంస్థల్లో అత్యధిక మార్కులు వచ్చినటువంటి విద్యార్థులకు అవార్డులు, రివార్డులు ఇస్తుంది. ప్రభుత్వ నిధులతో నడుస్తున్నటువంటి ఎయిడెడ్ పాఠశాలలకు వర్తింపచేయకపోవడం అన్యాయమని, అదొక వివక్షఅని మేనేజ్మెంట్ ని బట్టి విద్యార్థులపై వివక్షను చూపటం సరైంది కాదని ఎమ్మెల్సీ ఐ.వి అన్నారు. దీనిపై ఈరోజు ది.21.05.2023న పాఠశాల విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తో ఎమ్మెల్సీ ఐ. వెంకటేశ్వరరావు ఫోనులో మాట్లాడడం జరిగింది. ఈ విషయమై పునరాలోచిస్తామని మంత్రి ఎమ్మెల్సీ ఐ. వెంకటేశ్వరరావుకు కి తెలియజేశారు.