విశ్వంవాయిస్ న్యూస్, తాళ్ళరేవు:
కాకినాడ జిల్లా తాళ్ళరేవు మండలం సంతపేట సెంటర్లో పంచాయతీ వారి పరిధిలో నిర్వహిస్తున్న చలివేంద్రంలో తాళ్లరేవు లయన్స్ క్లబ్ సభ్యులు మజ్జిగ చలివేంద్రాన్ని ప్రారంభించారు. వేసవి తాపాన్ని దృష్టిలో పెట్టుకుని యొక్క మజ్జిగ పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు లైన్స్ క్లబ్ సభ్యులు మాట్లాడారు. మండుటెండలలో మజ్జిగ ఎంతో శరీరానికి మంచి చేకూరుస్తుందని అందు నిమిత్తమే వేసవి కాలం సమయంలో లయన్స్ క్లబ్ తరఫున ప్రతి ఏటా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి తాళ్ళరేవు సర్పంచ్ రెడ్డి అరుణ సుహాసిని దేవి రెడ్డి బాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈవో శంకర్ నారాయణ సర్పంచులు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. రెడ్డి సుహాసిని దేవి మాట్లాడుతూ ఈ మజ్జిగ పంపిణీ కార్యక్రమం వేసవి కాలంలో పంపిణీ చేయడం మంచి పని అని లయన్స్ క్లబ్ ప్రతినిధులను అభినందించారు. అనంతరం లయన్స్ క్లబ్ ప్రతినిధులు మజ్జిగ పంపిణీ ప్రారంభించి ప్రజలకు అందజేశారు. ఈ కార్యక్రమంలో తాళ్ళరేవు మండల లయన్స్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.