Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

ఫోన్ పే కొడితేనే ****** ధాన్యం లోడు దించుతా కొత్త రకం మిల్లర్ల దందా

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా:

రైస్ మిల్లు దగ్గర ధాన్యం దింపుకోవడంలో మిల్లర్ల దందా

 

కౌలు రైతుల నుండి వేలకు వేల రూపాయలు వసూలు చేస్తున్న వైనం

 

జిల్లా కలెక్టర్ కి విన్నవించిన

కౌలు రైతు సంఘం

 

విశ్వం వాయిస్ కలెక్టరేట్ న్యూస్

 

కౌలు రైతులు రైస్ మిల్లర్ల ఆగడాలను భరించలేకపోతున్నారని వాటిని తక్షణం అరికట్టాలని కౌలు రైతు సంఘం డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా కమిటీ కలెక్టర్ ను డిమాండ్ చేసింది

 

నేడు కౌలు రైతుల సమస్యలు పరిష్కారం చేయాలని కోరుతూ గ్రీవెన్స్ లో వివిధ సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని కలెక్టర్ హిమాన్సూ శుక్లాకి అందించడం జరిగింది

వినతి పత్రం అందించిన వారిలో

కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి పీతల రామచంద్ర రావు వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కారెం వెంకటేశ్వరరావు మరియు కౌలు రైతులు ఉన్నారు

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆరుగాలం కష్టించి పండించిన ధాన్యాన్ని కౌలు రైతులు స్వేచ్ఛగా అమ్ముకునే పరిస్థితులేవని ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మంగా రైతు భరోసా కేంద్రాల ద్వారా ప్రతి గింజ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని చెబుతున్నప్పటికీ మధ్య దళారుల చేతుల్లో కౌలు రైతులు మోసపోతున్నారని వాపోయారు

ఇటీవల కురిసిన వర్షాలకు తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసిన రైస్ మిల్లర్లు ఒక బస్తాకు పది నుంచి 20 కేజీల అదనంగా రైతుల నుండి తీసుకుంటున్నారని వారు వాపోయా

ఉదాహరణకు గన్నవరం కౌలు రైతు ఆదిమూలపు సూరయ్య కాపు అనే రైతు నుండి 20టన్నుల దన్యాన్ని కొలుగోలు చేసిన రైస్ మిల్లర్ 24000 రూపాయలు చెల్లిస్తే కానీ ధాన్యాన్ని తీసుకోబోమని డిమాండ్ చేయడంతో 24000 రూపాయలు ఫోన్ పే ద్వారా మిల్లర్లకు వేయడం జరిగిందని కలెక్టర్ దగ్గర మాపోయారు తక్షణం ఈ సమస్య పరిష్కారం చేయాలని సివిల్ సప్లై డిఎం ను సుదాసాగర్ ను కలెక్టర్ ఆదేశించడం జరిగింది

అలాగే ఉప్పలగుప్తం మండలం ఉప్పలగుప్తం గ్రామంలో గత పంటలో సాగు నీరందక పంటలు అన్నీ నాశనం అయ్యాయని ఆసందర్బంగా జిల్లా కలెక్టర్ హిమాన్సు శుక్లా కి పలు దఫాలు వినతిపత్రాలు సంఘం ఆద్వర్యంలో ఇవ్వడం జరిగిందని ఆరోజు ఆగ్రామంలో ఐదు చోట్ల చెక్ డాములు నిర్మాణానికి కలెక్టర్ ఇరిగేషన్ అధికారులును ఆదేశించడం జరిగిందని కానీ నేటికీ పనులు ప్రారంభం కాలేదని తక్షణం ఐదు చోట్ల చెక్ డాంల నిర్మాణాలు చేపట్టాలని డిమాండ్ చేశారు

ఈకార్టక్రమంలో ఆదిమూలపు సూరయ్యకాపు పి వెెంకట సాయిబాబూ తదుతరుల పాల్గోన్నారు

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement