విశ్వంవాయిస్ న్యూస్, రాజమహేంద్రవరం:
విద్యార్థినులు ఉన్నత స్థాయికి చేరాలి
– విశాఖపట్నం సెంటాన్స్ కాలేజీ ఫ్రెషర్స్ డే ఫంక్షన్ లో మేడపాటి షర్మిలారెడ్డి
విశాఖపట్నం,విశ్వం వాయిస్ న్యూస్:
విద్యార్థినులు ఉన్నత స్థానానికి చేరుకోవాలని రుడా చైర్ పర్సన్ మేడపాటి షర్మిలారెడ్డి కోరారు.విశాఖపట్నం మల్కాపూరం సెంటెన్స్ ఇంగ్లీష్ స్కూల్ ప్రిన్సిపాల్ ప్రేమకుమారి ఆహ్వానం మేరకు సెంటాన్స్ ఉమెన్స్ కాలేజీ ఫ్రెషర్స్ డే, సెంటెన్స్ ఫీస్ట్ కార్యక్రమంలో రుడా చైర్పర్సన్ మేడపాటి షర్మిలారెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి మహిళలు ముఖ్యంగా కాలేజీ అమ్మాయిలు కోసం దేశంలోనే ఎక్కడ లేని విధంగా రక్షణ కోసం దిశ చట్టం తీసుకొచ్చారని చెప్పారు.
అలాగే జగనన్న స్ఫూర్తితో రాజమండ్రిలో మహిళల సంరక్షణ కోసం జగనన్న ఉమెన్ సేఫ్ హెవెన్ షెల్టర్ రుడా ఆధ్వర్యంలో నిర్మించినట్లు తెలిపారు.ఈ షెల్టర్ లో మహిళలు ఇబ్బంది పడకుండా మహిళ పోలీస్ స్టేషన్, ఏసీ,డ్రింకింగ్ వాటర్, వాష్ రూమ్స్, సీసీ కెమెరాలు, మహిళ ఏటీఎం, అన్ని వస్తువులతో నిర్మించామని వివరించారు.ఉమెన్ స్టూడెంట్స్ అంటే ఏదో తెలియని పవర్ లాంటిది. ఎందుకంటే ఇప్పుడు అన్ని రంగాల్లో అమ్మాయిలు ప్రపంచం పోటీపడి ముందుకు సాగుతూ విజయం సాధిస్తున్నారు అలాగే మీరందరూ గ్లోబుల్ సోషల్ మీడియా వాట్సాప్ గ్రూప్ ఫేస్బుక్ సెల్ ఫోన్ లో ఉన్న అనేకమైన యాప్లకు గురికాకుండా బాగా చదువుకొని ఉన్నతమైన స్థాయిలో ఉండాలని ఆకాంక్షించారు.తల్లిదండ్రులను విద్య అందిస్తున్న ఉపాధ్యాయులను గౌరవించాలని షర్మిలారెడ్డి కోరారు.ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ సిస్టర్ గిసెల, ప్రిన్సిపాల్ ప్రేమకుమారి, వైస్ ప్రిన్సిపల్ లలిత, ఇంటర్మీడియట్ ప్రిన్సిపల్ సిస్టర్ జ్ఞానేష్ తదితరులు పాల్గొన్నారు.