Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

నారుమడి దశలోనే ఎండిపోతున్న పొలాలు

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

నారుమడి దశలోనే ఎండిపోతున్న పొలాలు

పోలేకుర్రులో కౌలు రైతుల ఆందోళన
రైతులకు నీళ్లు ఇస్తున్నామని చెప్పే ప్రభుత్వాలు ఇప్పుడు ఎక్కడ ఉన్నాయని కౌలు రైతులు విమర్శలు

విశ్వంవాయిస్ న్యూస్, తాళ్ళరేవు:

కాకినాడ జిల్లా తాళ్లరేవు :రైతులకు సమయం అనుకూలించేలా రైతు ఎల్లప్పుడూ మూడు పంటలు పండించుకునేలా నీరు ముందుగానే వచ్చేటట్లు ఏర్పాటు చేశామని గొప్పలు చెప్పుకునే ప్రభుత్వం రైతుల పొలాల వద్దకు వచ్చి పంట పొలాల పరిస్థితి ఎలా ఉందో శీలించాలని పోలేకుర్రులో కౌలు రైతులు మాట్లాడారు. నారుమడి మొదటి దశలోనే ఎండిపోయే పరిస్థితులు బీటలు వారే పరిస్థితులు చూస్తున్నామని స్థానిక కౌలు రైతు ఎస్ వెంకట శివరామకృష్ణ అన్నారు. రైతులు తమ పొలాలు ఎండిపోతున్నాయని పొలంలో సైకిల్ మోటార్ సైకిల్ తో నడిచి చూపిస్తూ నిరసన వ్యక్తం చేశారు. కొందరు రైతులు మాట్లాడుతూ ప్రభుత్వం రైతులకు సక్రమంగా నీటి సరఫరా అందించాలని కోరారు. పోలేకుర్రు తాళ్లరేవు పరిసర ప్రాంతాల్లో పొలాలు బీటెలు వారే పరిస్థితి ఉందని, మూడు పంటలు కాదు రెండు పంటలకు సరిపడా నీరు వస్తే సంతోషమని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం రైతులు బీటలు వారిన పంట పొలంలో తిరిగి నిరసన తెలిపారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement