విశ్వంవాయిస్ న్యూస్, మామిడి కుదురు:
నగరం గ్రామంలోని తాడి వారి మెరక లో ప్రజల ఆరోగ్య భద్రత దృష్ట్యా ముందస్తుగా ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసినట్లు గ్రామ సర్పంచ్ జాలెం రమణ కుమారి తెలిపారు. గురువారం తాడి వారి మెరక లో ఆలయం వద్ద వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి పలువురికి వైద్య పరీక్షలు నిర్వహించి మందులు అందజేశారు. రానున్న వర్షాకాలం నేపథ్యంలో సీజనల్ వ్యాధులు సోకే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.గ్రామ పంచాయితీ అధ్వర్యంలో పారిశుధ్య పనులు చేపట్టారు. వీధులను శుభ్రం చేసి బ్లీచింగ్ చల్లారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ అన్వర్ తాహిర్,స్థానిక నేతలు జాలెం సుబ్బారావు, జాలెం కృష్ణారావు,వార్ధు సభ్యులు బత్తుల సురేష్,కోళ్ల సురేష్, వైద్యాధికారినీ కే. స్వర్ణలత, ఎం.పీ.హెచ్.ఈ.వో లు త్రినాథ్, వెంకటేశ్వర రావు,నారాయణమ్మ, ఎం.పి.హెచ్.ఎస్ సత్యనారాయణ,ఏ.ఎన్.ఏమ్ లు చంద్రకుమారి,సునీత, హెల్త్ అసిస్టెంట్ ఏడుకొండలు , ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు….