విశ్వంవాయిస్ న్యూస్, మామిడి కుదురు:
ఇటీవలే నగరం ఎస్ .ఐ గా బాధ్యతలు చేపట్టిన ఎస్.ఐ పి.వి.ఎస్.ఎస్.ఎన్ .సురేష్ ను ఆదివారం మండల కాంగ్రెసు పార్టీ నేతలు మర్యాదపూర్వకంగా కలిశారు.ఎస్ ఐ ను పూలమాలలతో ఘనంగా సత్కరించారు.విధి నిర్వహణలో విశేష సేవలు అందించి ప్రజల మన్నలు పొందాలని వారు కోరారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల శాఖ అధ్యక్షుడు గెడ్డం వెంకటేశ్వర రావు,జిల్లా కార్యదర్శి అప్పన శ్రీ రామ కృష్ణ,వేగి రామ కృష్ణ,వానరాశి దొరబాబు తదితరులు పాల్గొన్నారు.