కార్మిక సంఘం జిల్లా నాయకుడు టేకుమూడిఈశ్వరరావు
విశ్వంవాయిస్ న్యూస్, తాళ్ళరేవు:
కాకినాడ జిల్లా తాళ్ళరేవు మండలంలోని ఉపాధి హామీ పథకం ద్వారా పనిచేసిన ఉపాధి కూలీలకు పెండింగ్ లో ఉన్న ఉపాధి వేతనాలను తక్షణమే చెల్లించాలని కాకినాడ జిల్లా కార్మిక సంఘం నాయకుడు టేకుమూడి ఈశ్వరరావు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని వివిధ గ్రామాల్లోని ప్రజలు ఉపాధి కూలీ పనులు చేసి నెలలు గడుస్తున్న ప్రభుత్వం కూలీలకు చెల్లించాల్సిన వేతనాలను పెండింగ్ పెట్టిందన్నారు. ప్రభుత్వం స్పందించి ఇప్పటికైనా తక్షణమే వేతనాలు చెల్లించాలని, ఒకవేళ చెల్లించని పక్షంలో ప్రభుత్వం ఉంటే ప్రభుత్వ కార్యాలయం వద్ద కూలీలతో ఆందోళన చేస్తామని అన్నారు. అనంతరం మండల ప్రజా పరిషత్ సూపరిండెంట్ కు, ఉపాధి హామీ ఏపీఓకు వినతి పత్రాలు అందజేశారు. ఈయన వెంట కార్మిక సంఘం నాయకులు ఉన్నారు.