—- ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే అక్రమ కేసులా ???
— రానున్న ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి
— జగన్ ప్రభుత్వాన్ని గద్దె దించాలని పిలుపు
—- ధ్వజమెత్తిన టీడీపీ సీనియర్ నాయకులు జాలెం సుబ్బారావు
విశ్వంవాయిస్ న్యూస్, మామిడి కుదురు:
రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నియంత పాలన నడుస్తుందని పి. గన్నవరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు జాలెం సుబ్బారావు ప్రభుత్వం పై ధ్వజమెత్తారు. ఈ మేరకు మామిడికుదురు మండలంలోని నగరం గ్రామంలో మంగళవారం జాలెం సుబ్బారావు మాట్లాడుతూ….. ప్రజల అభిప్రాయాలను నిర్భయంగా ప్రకటించే స్వేచ్ఛ కూడా లేకుండాపోయిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ నిరంకుశ వైఖరిని ప్రశ్నిస్తున్న వారిపై పోలీస్ వ్యవస్థ ద్వారా ఉక్కుపాదం మోపాలని ప్రభుత్వం ప్రయత్నిస్తుండటం దురదృష్టకరమని జాలెం సుబ్బారావు ప్రభుత్వ వైఖరిని విమర్శించారు. ప్రజాస్వామ్య విలువలను సైతం తుంగలోకి తొక్కుతున్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి రాబోయే ఎన్నికల్లో బుద్ది చెప్పి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలని జాలెం సుబ్బారావు పిలుపునిచ్చారు. ఈ రాష్ట్రంలో అన్నీ వర్గాల ప్రజల సుభిక్షంగా ఉండాలంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలన్నారు. ఈ రాష్ట్రంలో ప్రభుత్వమే నాసిరకమైన మద్యాన్ని అమ్ముతూ ప్రజలనుండి ధనాన్ని సమకూర్చుకోవడమే కాకుండా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడటం అనేది మూర్ఖత్వము చర్య అని జాలెం తెలిపారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని గద్దె దించకపోతే రాష్ట్రం అప్పుల ఆంద్రప్రదేశ్ గా మారిపోయే ప్రమాదం ఉందని జాలెం సుబ్బారావు ఎద్దేవా చేశారు. మహనీయులు కలలుకన్న స్వర్ణాంధ్రప్రదేశ్ నారా చంద్రబాబు నాయుడితోనే సాధ్యమౌతుందని సుబ్బారావు తెలిపారు. ఈ రాష్ట్ర ప్రభుత్వ పాలనలో ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల హక్కులు , అవకాశాలు, రాయితీలు గాల్లో కల్సిపోతున్నాయంటూ జాలెం సుబ్బారావు రాష్ట్ర ప్రభుత్వం పై తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేశారు.