చేనేత వస్త్రాలు,హస్తకళావస్తువులను ప్రోత్సహించాలి
విశ్వంవాయిస్ న్యూస్, రాజమహేంద్రవరం:
చేనేత,హస్తకళల ప్రదర్శన,అమ్మకం ప్రారంభం
20 శాతం తగ్గింపు ధరలతో విక్రయాలు
చేనేత వస్త్రాలు,హస్తకళావస్తువులను ప్రోత్సహించాలి
రుడా చైర్ పర్సన్ మేడపాటి షర్మిలారెడ్డి
రాజమహేంద్రవరం, నవంబరు23: స్వదేశీ హ్యాండీ క్రాఫ్ట్ సొసైటీ ఆధ్వర్యంలో జాంపేట శ్రీ ఉమారామలింగేశ్వర కల్యాణ మండపంలో ఏర్పాటు చేసిన
చేనేత హస్తకళల ప్రదర్శనను గురువారం రుడా చైర్ పర్సన్ మేడపాటి షర్మిలారెడ్డి ప్రారంభించారు.ఈ సందర్భంగా షర్మిలారెడ్డి మాట్లాడుతూ చేనేత హస్తకళలలు మనదేశ వారసత్వ సంపద అని, ప్రజలు వీటిని విరివిగా కొనుగోలు చేసి చేనేత కార్మికులను,హస్తకళా కారులను ప్రోత్సాహించాలని కోరారు. చేనేత కార్మికులు,హస్త కళాకారులు తయారు చేసిన వస్త్రాలు ఈ ప్రదర్శనలో నేరుగా విక్రయించడం వల్ల 20 నుంచి 30 శాతం తక్కువ ధరలకు లభిస్తున్నాయని తెలిపారు.అందానికి అందం,మన్నిక కలిగిన వీటిని ప్రతి ఒక్కరూ ధరించాలని షర్మిలారెడ్డి సూచించారు.స్వాతంత్ర్యపోరాట సమయంలో కూడా మహాత్మాగాంధీ చేనేత,ఖాదీ వస్త్రాలను, హస్తకళలను ప్రోత్సహించాల్సిన అవసరాన్ని ప్రజలకు తెలియచెప్పేవారని గుర్తు చేశారు.ఇలాంటి ప్రదర్శనల్లో విక్రయించే వాటిని కొనడం ద్వారా మహిళా కార్మికుల ఆర్థిక పురోభివృద్ధికి సహకరించినట్లవుతుందని షర్మిలారెడ్డి పేర్కొన్నారు.వివిధ రాష్ట్రాల్లో పేరుగాంచిన నాణ్యమైన వస్త్రాలు,వస్తువులు ఒకే చోట లభిస్తున్నాయని సంతోషం వ్యక్తం చేశారు. నిర్వాహకుడు చిరంజీవి రాంబాబు మాట్లాడుతూ డిసెంబర్ 5 వ తేదీ వరకు ఈ ప్రదర్శన అమ్మకాలు జరుగుతాయని తెలిపారు.ప్రతిరోజు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు విక్రయాలు జరుగుతాయని చెప్పారు.పోచంపల్లి, గద్వాల్,నారాయణపేట, వెంకటగిరి,జరీ చీరలు,మంగళగిరి, గుంటూరు సిల్క్,కాటన్ చీరలు, దుప్పట్లు,కర్టైన్లు, టవల్స్ సోఫా కవర్లు, ఖాదీ మెటీరియల్,1 గ్రాము గోల్డ్ నగలు,కొండపల్లి,ఏటికొప్పాక,కొయ్యతో చేసిన బొమ్మలు,వెండి ముత్యాల ఆభరణాలు, ఇత్తడి వస్తువులు,నారపీచు వస్తువులు, స్ఫటిక, రుద్రాక్ష మాలలు,లెదర్ వస్తువులు,అగరబత్తీ తదితర రకాల వస్తువులు లభిస్తున్నాయని చిరంజీవి రాంబాబు వివరించారు.