విశ్వంవాయిస్ న్యూస్, రాజమహేంద్రవరం:
23న ఆటోలు బంద్
కోటిపల్లి బస్టాండ్ నుంచి మౌన ప్రదర్శన
రాజమహేంద్రవరం, జనవరి 21: మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం హామీని వ్యతిరేకిస్తూ ఆటో వర్కర్స్ యూనియన్ జేఏసీ ఆధ్వర్యంలో ఈ నెల 23వ తేదీ మంగళవారం ఆటోల బంద్ నిర్వహిస్తున్నట్లు జేఏసీ నాయకులు వాసంశెట్టి గంగాధరరావు, బొలిశెట్టి సత్యనారాయణ ప్రసాద్ (బాక్సు ప్రసాద్) ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా మంగళవారం ఉదయం 9 గంటలకు కోటిపల్లి బస్టాండ్ నుంచి కోటగుమ్మం సెంటర్ వరకు మౌన శాంతి ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ బంద్ లో అన్ని ఆటో సంఘాల సభ్యులు, సంఘాల్లో లేని సభ్యులు కూడా పాల్గొంటారని తెలిపారు. ఆరోజు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు నగరంలో ఆటోలు తిరగవని, కావున ఈ అసౌకర్యానికి ప్రజలు సహకరించాలని కోరారు.