విశ్వంవాయిస్ న్యూస్, రాజమహేంద్రవరం:
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజమహేంద్రవరం పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ గూడూరి శ్రీనివాస్, గూడూరి రాధిక దంపతులు ఆదివారం ఉదయం రాజమండ్రి గ్రామ దేవత సోమాలమ్మ తల్లి (శ్యామలాంబ)ని దర్శించుకున్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్దిత్వం ఖరారైన నేపథ్యంలో ఆలయాల సందర్శనలో భాగంగా నేడు రాజమండ్రి గ్రామ దేవత శ్యామలాంబ అమ్మవారిని దర్శించుకున్నారు. డాక్టర్ గూడూరు దంపతుల కు ఆలయం ఈవో సతీష్, అర్చకుడు సత్యనారాయణలు ఆలయ సాంప్రదాయ పద్ధతిలో స్వాగతం పలికారు. అనంతరం ఉభయ తెలుగు రాష్ట్రాల శెట్టిబలిజ సంఘం అధ్యక్షులు పిల్లి సుబ్రమణ్యంతో కలిసి డాక్టర్ గూడూరి దంపతులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ గూడూరి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ ఎంపీ అభ్యర్థిగా ఎంపికైన నేపథ్యంలో అమ్మవారి ఆశీస్సులు అందుకోవడానికి రావడం జరిగింది అన్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల శెట్టిబలిజ సంఘం అధ్యక్షులు పిల్లి సుబ్రహ్మణ్యం నుండి ఆశీస్సులు అందుకోవడం జరిగిందన్నారు. అమ్మవారి కృపాకటాక్షాలు ప్రజలపై ఉండాలని ఆకాంక్షించారు. పిల్లి సుబ్రమణ్యం మాట్లాడుతూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో శెట్టిబలిజ సామాజిక వర్గానికి సముచిత గౌరవం దక్కడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే వచ్చే ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను గెలిపిస్తాయన్నారు. రాజమండ్రి గ్రామ దేవత శ్యామలాంబ అమ్మవారి కృపాకటాక్షాలు గూడూరు శ్రీనివాస్ పై ఉంటాయని, వచ్చే ఎన్నికల్లో ఆయన విజయం సాధిస్తారని ఆకాంక్షించారు. తదుపరి సుబ్రమణ్యం ఇంటికి విచ్చేసిన డాక్టర్ గూడూరు ని సాలువాతో సత్కరించి ఆశీర్వాదం అందించారు ఈ కార్యక్రమంలో పిల్లి శ్రీనివాసరావు కడియాల వీరభద్రరావు, పిల్లి గంగాధర్, రాయుడు శ్రీనివాస్, గుడివాడ వెంకన్న, కట్టా శంకర్, పిల్లి బాబి, సతీష్, భద్ర రావు, చిన్న, నాని, ప్రసాద్, శివ, చిన్నారావు, గోవింద్, కురుమిల్లి శాంతి స్వరూప్, వంకాయల సత్తిబాబు, తగరం సురేష్ తదితరులు పాల్గొన్నారు.