విశ్వంవాయిస్ న్యూస్, రామచంద్రపురం:
రామచంద్రపురం మండలం విశ్వం వాయిస్ న్యూస్ పట్టణం పెద్ద వంతెన వద్ద అగ్ని ప్రమాదం జరిగి కొండ్రెడ్డి కుటుంబాలకు చెందిన రెండిల్లులు దగ్ధమై పెద్ద మొత్తంలో ఆస్తి నష్టం జరిగిన విషయం తెలిసినదే.ప్రమాదం జరిగిన కుటుంబాలను ఆదుకోవాలని ఉద్దెశంతో పట్టణ కాపు ఐక్యత ఆధ్వర్యంలో ప్రమాదం జరిగిన రెండు కుటుంబాలకు రామచంద్రపురం నియోజకవర్గంలో కాపు ఐక్యత గ్రూపు ద్వారా 60 వేల రూపాయలు సేకరించి తెలుగుదేశం నాయకులు రాయపురెడ్డి రాజా మరియు డాక్టర్ రఘువీర్ కాంత్ చేతుల మీదుగా ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాగాపు అమ్మిరాజు చిలుకూరి బ్రదర్స్ తొగరు మూర్తి అల్లం రామకృష్ణ చిక్కాల సుబ్బారావు సలాది శ్రీను కుప్పాల కొండ తదితర కాపు నాయకులు పాల్గొన్నారు.