Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

బియ్యం తరిలిస్తున్న వాహనం సిజ్ చేసిన సిబ్బంది

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్, రాజమండ్రి:

రీజనల్ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ తనిఖీలో పట్టుబడిన రేషన్ బియ్యం

 

కాకినాడ,అంబేద్కర్ కోనసీమ జిల్లాలో

చౌక బియ్యం ఆక్రమ నిల్వలు గుర్తుంచిన అధ

సంబంధిత వ్యక్తులపై క్రిమినల్ కేసు నమోదు

రాజమహేంద్రవరం విశ్వం వాయిస్ న్యూస్ :-రాజమండ్రి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు వారికి వచ్చిన పి.డి.ఎస్‌ చౌక బియ్యం అక్రమ నిల్వ మరియు రవాణాకు సంబంధించిన విశ్వసనీయ సమాచారం మేరకు కాకినాడ జిల్లా కోటనందూరు మండలం, కోటనందూరు గ్రామములో శ్రీమహాలక్ష్మి రైస్ మిల్ మరియు అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని రాయవరం మండలములోని, మాచవరం గ్రామం,సరిట వీధి ఏరియాలో ఒక పాడుబడిన గది నందు తనిఖీలు చేసి పి.డి.ఎస్‌ చౌక బియ్యం అక్రమ నిల్వలను గుర్తించి సంబందిత వ్యక్తులపై క్రిమినల్ కేసులు నమోదు చేసిన

రీజనల్ విజిలెన్స్ మరియు ఎన్ఫోర్స్మెంట్ అధికారులు

 

వివరాలులోకి వెళ్ళితే

 

కాకినాడ జిల్లా కోటనందూరు మండలం, కోటనందూరు గ్రామములో శ్రీమహాలక్ష్మి రైస్ మిల్ నందు పి.డి.ఎస్‌ చౌక బియ్యం అక్రమ నిల్వ మరియు రవాణాకు సంబంధించిన విశ్వసనీయ సమాచారంపై విజిలెన్స్ అధికారులు,రెవెన్యూ మరియు సివిల్ సప్లయ్స్ అధికారులతో కలిసి తనిఖీ చేయగా సుమారు 25300 కేజీల పిడిఎస్ బియ్యంను గుర్తించటమైనది.సదరు రైస్ మిల్ శ్రీ పోతల రాంబాబు వారికి చెందినది.ఈ రైస్ మిల్ నందు పి.డి.ఎస్‌ చౌక బియ్యంను కోటనందూరు పరిసర ప్రాంతములలోని రేషన్ కార్డుదారుల నుండి కిలో 18 రూపాయలకు కొనుగోలు చేసిన మోటార్ సైకిలిస్ట్

ల నుండి ,అదే బియ్యాన్ని కిలో రూ.20 లకు కొనుగోలు చేసి కిలో 23 రూపాయలకు ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి ఆక్రమముగా CG 04 MY 4540 అను నెంబర్ గల టాటా కంపెనీ లారీ లో తరలిస్తున్నట్లు అధికారులు గుర్తించినారు.సివిల్ సప్లయ్స్ అధికారులు ఈవిదంగా పిడిఎస్ బియ్యాన్ని అక్రమముగా కొనుగోలు చేసి,నిల్వ ఉంచి, అక్రమముగా రవాణా చేయుచున్న మరియు అమ్మకము చేస్తున్న పోతల రాంబాబు,శెట్టి శ్రీనివాసరావ్,కోన ప్రభుదాస్,మోహన్ లాల్ యాదవ్,ఆనంద్ దేవాంగన్ మరియు సంబందిత వ్యక్తులపై క్రిమినల్ కేసు నమోదు కొరకు కోటనందూరు పోలీస్ స్టేషన్ వారికి సిఫారసు చేయటమైనది మరియు అధికారులు రైస్ మిల్ నందు మరియు CG 04 MY 4540 అను నెంబర్ గల టాటా కంపెనీ లారీ నందు గల 25300 కిలోల పిడిఎస్‌ చౌక బియ్యంను, 4 ఎలక్ట్రికల్ కాటాలను,1400 కిలోల ఫోర్టిఫైడ్ రైస్ కెర్నల్ లను, 12300 కిలోల బియ్యం, 3750 కిలోల ధాన్యం,1500 కిలోల బ్రోకెన్ రైస్,1050 కిలోల రైస్ బ్రాన్ లను సీజ్ చేసినారు.వీటి విలువ సుమారు 40,93,548 రూపాయలుగా నిర్దారించినారు.

అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని రాయవరం మండలములోని, మాచవరం గ్రామం,సరిట వీధి ఏరియాలో ఒక పాడుబడిన గది నందు పిడిఎస్‌ రేషన్ బియ్యం బియ్యం అక్రమంగా నిల్వ ఉంచారన్నా సమాచారముతో విజిలెన్స్ అధికారులు,రెవెన్యూ మరియు సివిల్ సప్లయ్స్ అధికారులతో సదరు ప్రదేశం నందు తనిఖీ చేయగా,సదరు గది నందు 41 బస్తాలలో సుమారు 2411 కేజీల పిడిఎస్‌ బియ్యంను గుర్తించటమైనది.సదరు పిడిఎస్‌ చౌక బియ్యంను మాచవరం గ్రామ నివాసి అయినా మేడపాటి రామారెడ్డి అను ఆసామి రాయవరం మండలం పరిసర ప్రాంత గ్రామములలోని రేషన్ కార్డుదారుల నుండి కిలో రూ.20 రూపాయలకు కొనుగోలు చేసి,అదే బియ్యాన్ని కిలో 22 రూపాయలకు ఇటుక బట్టి కార్మికులకు విక్రయిస్తున్నారు.సదరు బియ్యంకు సంబందించి ఎటువంటి బిల్లులు లేనందున సివిల్ సప్లయ్స్ అధికారులు,రాయవరం మండలం వారు సుమారు రూ 1,09,700 రూపాయలు విలువ గల 2411 కేజీల పి.డి.ఎస్‌ చౌక బియ్యం సీజ్ చేసి 6-ఏ క్రింద కేసు నమోదు చేసి, పిడిఎస్ బియ్యాన్ని అక్రమముగా కొనుగోలు చేసి,అమ్మకము చేస్తున్న మేడపాటి రామారెడ్డి మరియు సంబందిత వ్యక్తులపై క్రిమినల్ కేసు నమోదు కొరకు రాయవరం పోలీస్ స్టేషన్ కు సిఫారసు చేయటమైనది.

ఈసందర్భముగా ఎస్.పి. కె.ఎస్.ఎస్.వి.సుబ్బారెడ్డి, ఐపిఎస్ మాట్లాడుతూ రాజమహేంద్రవరం రీజనల్ విజిలెన్స్ మరియు ఎన్ఫోర్స్మెంట్ పరిధిలోని మూడు జిల్లాలలో పి.డి.ఎస్‌ చౌక బియ్యం అక్రమ నిల్వలు, అక్రమ రవాణా పై నిరంతరం నిఘా కొనసాగుతుంది అని, ఎవ్వరైనా రైస్ మిల్ యజమానులు గాని మరియు ఎవరయినా వ్యక్తులు గాని పి.డి.ఎస్‌ చౌక బియ్యం కొనడం,అమ్మడం చేస్తే సదరు రైస్ మిల్ వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం అని తెలియచేసినారు.

ఈతనిఖిలలో విజిలెన్స్ అధికారులు ఎస్ఐ జగన్నాధరెడ్డి,ఏఓ భార్గవ మహేష్,ఏజి లక్ష్మీనారాయణ,డిసిటిఓ నవీన్ కుమార్,పిసిఎస్ లోవరాజు,వలీ,వీరబాబు, శివ మరియు సివిల్ సప్లయ్స్ అధికారులు ఏఎస్ఓ ప్రసన్న లక్ష్మీ,సిఎస్డిటి కిరణ్ మరియు అలీషా వార్లు పాల్గొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement