సత్యం,ధర్మం, శాంతి, ప్రేమ, అహింస వంటి జీవిత సత్యాలు ప్రభోదం
ఎంపీపీ నౌడు వెంకటరమణ
విశ్వం వాయిస్ న్యూస్, రాయవరం
సత్యం,ధర్మం, శాంతి, ప్రేమ, అహింస వంటి మంచి గుణాలే విలువైన ఆస్తిగా జీవించడమే కాక, సమాజానికి ఆధ్యాత్మికత, సేవాభావం నేర్పించిన శక్తి భగవాన్ సత్యసాయి బాబా అని మండల పరిషత్ అధ్యక్షులు నౌడు వెంకటరమణ పేర్కొన్నారు. డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, మండల కేంద్రమైన రాయవరం మండల పరిషత్ కార్యాలయంలో భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి శత జయంతి వేడుకలను ఎంపీడీవో కీర్తి స్పందన ఆద్వర్యంలో ఆదివారం నిర్వహించారు. తొలుత సత్యసాయి బాబా చిత్రపటానికి పూలమాలలు వేసి జయంతి వేడుకలు ప్రారంభించగా, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న...
రైతు సేవా కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు ప్రారంభం
ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఏఎంసీ చైర్మన్, వాసంశెట్టి సత్యం
విశ్వం వాయిస్ న్యూస్, ద్రాక్షారామ
దేశానికి అన్నం పెట్టే అన్నదాతలను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం వెనకాడబోదని ఎన్డీఏ కూటమి, తేదేపా సీనియర్ నాయకులు వాసంశెట్టి సత్యం పేర్కొన్నారు. డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, ద్రాక్షారామంలో సోమవారం ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ అక్కల రిశ్వంతరాయ్, జనసేన ఇన్చార్జి పోలిశెట్టి చంద్రశేఖర్, వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా వాసంశెట్టి సత్యం మాట్లాడుతూ రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని అన్నారు. దీనికిగాను రామచంద్రపురం నియోజవర్గం లో 62...
వెల్లువలా సాగిన దేశభక్తి విద్యార్థులకు వివరించిన అధికారులు
విశ్వం వాయిస్ న్యూస్, రాయవరం
దేశంలో స్వతంత్ర కాంక్షను రగిలించిన వందేమాతరం గేయం బక్కిం చంద్రనాద్ చటర్జీ రచించి 150 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా కేంద్ర ప్రభుత్వ పిలుపుమేరకు దేశంలో పలుచోట్ల వందేమాతరం గీతాలాపన జరిగించారు.
* వందేమాతర గేయం చరిత్ర
కలకత్తాలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో 1866 సంవత్సరం లో గురుదేవ్ రవీంద్రనాథ్ ఠాగూర్ మొదటి సారి వందేమాతరం గీతాన్ని ఆలపించగా, అప్పటినుండి వందేమాతరం పాడడం ఒక సంప్రదాయంగా మారింది. బ్రిటిష్ వారి పై తిరుగుబాటు ఉద్యమాలలో వందేమాతరం గీతాన్ని పసిపిల్లల నుంచి వృద్ధుల దాకా నినదిస్తూనే తెల్ల దొరలను ఎదురించారు. అంత గొప్పస్పూర్తిని, ఉద్యమకాంక్షను రగిలించిన శక్తిమంతమైన జాతీయ గీతం వందేమాతరం....
మండల వ్యాప్తంగా 170 చేనేత కార్మికుల కుటుంబాలకు సహాయం
గ్రామంలో 56 కుటుంబాలకు సరఫరా చేసిన కూటమి నాయకులు
విశ్వం వాయిస్ న్యూస్, రాయవరం
ఇటీవల రాష్ట్రంలో అలజడి సృష్టించిన మొంథా తుఫాను తీవ్రత దృష్ట్యా ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలలో ఆశ్రయం పొందిన బాధిత కుటుంబాలకు ఆర్థిక సహాయం, నిత్యావసర సరుకులను అందోంచడం తో పాటు, తుఫాను తీవ్రత వలన జీవనోపాధి కి ఆటంకం ఏర్పడిన చేనేత ,మత్స్యకార కుటుంబాలకు కూడా రాష్ట్ర ప్రభుత్వం చేయూత నందిస్తూ, సహాయంగా ప్రకటించిన నిత్యవరాలను కూటమి కార్యకర్తలు,లబ్దిదారులకు గురువారం అందించారు. డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, మండల కేంద్రమైన రాయవరంలో స్థానిక శాసన సభ్యులు వేగుళ్ళ జోగేశ్వరరావు ఆదేశాల మేరకు చేనేత కార్మికులకు నిత్యావసర...
ఘనంగా రాయవరం మునసబు 36 వ వర్థంతి కార్యక్రమం
డిల్లీ నుండి గల్లీ వరకూ రాజకీయం లో సిధ్ధహస్తం
రాయవరం లో అభిమానుల ఘన నివాళులు
విశ్వం వాయిస్ న్యూస్, రాయవరం
దాతృత్వం తో ఎందరో అభాగ్యులకు తమ సొంత స్ధలాలను ఇళ్ళ కొరకు దానమివ్వడమే కాక, అనేకులు విద్యావంతులుగా మారడానికి పాఠశాలలు, కళాశాలలను స్థాపించి ప్రోత్సహించిన, రాయవరం మునసబు, వుండవిల్లి సత్యనారాయణ మూర్తి 36 వ వర్ధంతిని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా, మండల కేంద్రమైన రాయవరంలో గురువారం ఆయన అభిమానులు ఘనంగా నిర్వహించారు. వెదురుపాక తాలూకా రాయవరం గా పిలవబడే గ్రామాన్ని, మునసబు గారి రాయవరం అనేలా తన ప్రత్యేకతను చాటడమే కాక, గల్లీ నుండి ఢిల్లీ వరకూ రాజకీయం చేయడం లో...
ప్రతి ఇంటా స్వదేశీ - ఇంటింటా స్వదేశీ నినాదంతో ప్రచారం
సోమేశ్వరం గ్రామంలో ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ కార్యక్రమం
విశ్వం వాయిస్ న్యూస్, రాయవరం
ప్రజా సమస్యలు పై అధికారులతో మాట్లాడుతూ, గ్రీవెన్స్ కు వెళ్లి సమస్యల పరిస్కారం కు కృషి చేస్తూ మండలంలో విస్తృత ప్రచారం చేయాలని బిజెపి మండల ఇంచార్జి, సీనియర్ నాయకులు కోన సత్యనారాయణ పేర్కొన్నారు. ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ కార్యక్రమం ద్వారా ప్రతి ఇంటా స్వదేశీ - ఇంటింటా స్వదేశీ నినాదంతో డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, రాయవరం మండలం, సోమేశ్వరం గ్రామంలో బిజెపి మండల అద్యక్షులు శాకా దుర్గా శ్రీనివాస్ అద్యక్షతన ఏర్పాటు చేసుకోని సమావేశం నిర్వహించగా, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా...
జిల్లా స్థాయిలో రాణించి రాష్ట్ర స్థాయికి ఎంపికైన భార్గవ్
నవంబర్ 1 నుండి జరగనున్న రాష్ట్రస్థాయి పోటీలు
విశ్వం వాయిస్ న్యూస్, రాయవరం
రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలకు రాయవరం హైస్కూల్ విద్యార్థి ఎంపికైనట్లు శ్రీ రామయ్య జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు విప్పర్తి శాంతి సునీత శుక్రవారం తెలిపారు. పాఠశాల లో చదువుతున్న పదవ తరగతి విద్యార్థి పోలిశెట్టి భార్గవ్ ఇటీవల కాలంలో అనపర్తిలో నిర్వహించిన జిల్లాస్థాయి పోటీలలో అధ్బుత ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యాడని, నవంబర్ 1వ తేదీ నుండి తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరులో జరిగే రాష్ట్రస్థాయి పోటీలలో భార్గవ్ పాల్గొంటారన్నారు. కాగా వాలీబాల్ క్రీడలో ప్రతిభను కనుబరిచి, పాఠశాలకు గుర్తింపు తెచ్చిన పోలిశెట్టి భార్గవ్ ను అతనికి క్రీడలో...
పడిపోయిన, నీటి మునిగిన 4562 హెక్టార్ల విస్తీర్ణం.
7570 మంది రైతులకు పంటనష్టం
మండల వ్యవసాయ అధికారి కెవిఎన్ రమేష్ కుమార్
విశ్వం వాయిస్ న్యూస్, రాయవరం
మొథా తుఫాను తీవ్రత కారణంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, మండల వ్యాప్తంగా పడిపోయిన, నీట మునిగిన వరి పంట పొలాలను రాయవరం మండల వ్యవసాయాధికారి కెవిఎన్ రమేష్ కుమార్ బుధవారం సందర్శించారు. మాచవరం, చెల్లూరు, వెంటూరు, కురకాళ్లపల్లి, కూర్మాపురం గ్రామాల్లోని పంట పొలాలను పరిశీలించిన ఆయన విలేకరులకు వరి పంట నష్టం ప్రాథమిక అంచనాను తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల వ్యాప్తంగా 4562 హెక్టార్ల విస్తీర్ణంలో పంట నష్టం సంభవించిందని వాటిలో 1879 హెక్టార్ల విస్తీర్ణంలో పంట నీట మునగగా, 2683 హెక్టార్ల...
జలవనరుల శాఖ మంత్రి నిమ్మల కు విజ్ఞాపన తెలిపిన వెంకటేశ్వరరావు
సోషల్ మీడియా వేదికగా వరమిచ్చిన ఐటీ శాఖ మంత్రి లోకేష్
సంభ్రమాశ్చర్యానికి గురైన చెల్లూరు కు చెందిన దివ్యాంగుడు
విశ్వం వాయిస్ న్యూస్, రాయవరం
తనకు బ్యాటరీ వాహనం ఇప్పించాలని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రిని కలిసిన దివ్యాంగుడి కి సొంత ఖర్చులతో బ్యాటరీ వెహికల్ ను ఇంటికి పంపిస్తామని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, రాయవరం మండలం చెల్లూరు గ్రామానికి చెందిన వెంకటేశ్వరరావు ఇటీవల కాలంలో పాలకొల్లు నియోజకవర్గం లో పర్యటనలో ఉన్న రాష్ట్ర జలవనురుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ను ఆటోలో వెళ్లి కలిసారు. ఆయనతో వెంకటేశ్వరరావు...
నదురుబాద గ్రామ సర్పంచ్ శ్రీనివాసరావు ముందుచూపు
ప్రభుత్వ పాఠశాలలో పునరావాస కేంద్రం ఏర్పాటు
తుఫాను ప్రభావం దృష్ట్యా బయటకు రావద్దని హెచ్చరిక
విశ్వం వాయిస్ న్యూస్, రాయవరం
మొథా తుఫాన్ తీవ్రత అధికంగా ఉంటుందనే ఉన్నతాధికారుల ఆదేశాలతో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడడంతో, గ్రామ ప్రజలకు త్రాగునీటి సమస్య ఎదురవకూడదనే ఆలోచనతో నదురుబాద గ్రామంలో జనరేటర్ ను ఏర్పాటు చేసినట్లు గ్రామ సర్పంచ్ చింతపల్లి శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా విద్యుత్ సరఫరా నిలిపివేయడం తో మంగళవారం ఉదయం నుండి విద్యుత్ లేనందున త్రాగునీటి ఇబ్బంది ఏర్పడ కూడదని ముందు జాగ్రత్త చర్యలుగా జనరేటర్ ను ఏర్పాటు చేసామని, ఈ జనరేటర్ ద్వారా విద్యుత్ కలెక్షన్ ఇచ్చి త్రాగునీటి సమస్యను పరిష్కరించామన్నారు....