Wednesday, July 30, 2025
Wednesday, July 30, 2025
టెలిగ్రామ్
తాజా అప్డేట్స్ కోసం — మన టెలిగ్రామ్ చానల్‌లో చేరండి
చేరండి

రాయవరం

భారతీయ జనతా పార్టీ నూతన జిల్లా కార్యవర్గం ఎన్నిక

విశ్వం వాయిస్ న్యూస్, రాయవరం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, బీజేపీ సంస్థాగత నియామకాలలో భాగంగా మండపేట నియోజవర్గం రాయవరం మండలం, లొల్ల గ్రామంలో మండల భాజపా అధ్యక్షులు శాకా దుర్గా శ్రీనివాస్ అధ్యక్షతన నూతనంగా జిల్లా పదవులు పొందిన నాయకులను బిజెపి మండపేట నియోజకవర్గ కన్వీనర్ కె వి వి సాయిరామ్ ఘనంగా సత్కరించారు. నూతన జిల్లా కమిటీకి ఉపాధక్షులుగా రాయవరం మండలం లొల్ల గ్రామ సర్పంచ్ చాట్రాతి జానకి రాంబాబు ను రెండవసారి నియమించగా, మరొక ఉపాధక్షులు గా వెదురుపాక కు చెందిన పార్టీ సీనియర్ నాయకురాలు శ్రీదేవి ని ఎన్నుకున్నారు. జిల్లా కార్యవర్గ సభ్యులుగా పూర్వ మండల అధ్యక్షులు రాయి వీర్రాజు, తుమ్మలపల్లి సూర్యనారాయణ, నరాల రాంబాబు,...

గ్రామ సింహాల గూండా గిరి

చట్టాల రక్షణ లో శునక మహారాజులు ప్రజా ప్రతినిధులకు మొర పెట్టినా మొండి చేయి మండలంలో విస్తారంగా పెరిగిపోయిన గ్రామ సింహాలు రంగు నీటి డబ్బా లే రక్షణ గా ప్రజల పాట్లు విశ్వం వాయిస్ స్పెషల్ రిపోర్ట్ టీం, రాయవరం మండలంలో గ్రామ సింహాలు సృష్టిస్తున్న అలజడితో పలు గ్రామాల ప్రజలు నిత్యం భయంతోనే బ్రతుకీడుస్తున్నారు, ప్రతి వీధిలోను పదుల సంఖ్యలో వీధి కుక్కలు గుంపులుగా చేరి, ఎప్పుడు ఎవరిపై దాడి చేస్తాయో.? ఏ ప్రమాద వార్త తమ చెవిన పడుతోందో ? అనే ఆందోళనలోనే ప్రజానికం సతమతమవుతున్నారు. ప్రధాన రహదారులు, ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలకు వెళ్లే మార్గాలు, ఇతర రహదారులపై వీధి కుక్కలు గుంపులుగా సంచరిస్తూ, కార్యాలయాలకు వివిధ అవసరాల కోసం వచ్చే ప్రజలకు, పాఠశాలకు...

చేనేత పరిశ్రమను ఆదుకుని,బకాయిలు చెల్లించాలని వినతి

విశ్వం వాయిస్ న్యూస్, రాయవరం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, మండపేట నియోజకవర్గం ,రాయవరం మండలం, చెల్లూరు చెల్లూరు గ్రామంలో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం సందర్భంగా రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యాపుల కేశవ్ పర్యటించిన సందర్భంగా, నియోజకవర్గంలోని పలు చేనేత సంఘాలు మంత్రిని కలిసి, తమ సమస్యలను పరిష్కరించాలని వినతి పత్రాలు అందజేశారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు,దివంగత నేత,ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు పరిపాలనలో, పని లేక ఇబ్బంది పడుతున్న చేనేత కార్మికులను ఆదుకుని భోజనం పెట్టారని, ఆయన ప్రవేశపెట్టిన జనతా వస్త్రాల పధకం ద్వారా చేనేత కార్మికులందరూ జనతా వస్త్రాలు తయారుచేసి ఉపాధి పొందారని, కానీ ఇప్పుడు మరల గడ్డుకాలం ఏర్పడి మరమగ్గాల...

రేపు పసలపూడి,చెల్లూరు గ్రామాలలో విద్యుత్ సరఫరా కు అంతరాయం

విశ్వం వాయిస్ ప్రాంతీయ డెస్క్, రాయవరం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, రాయవరం మండలంలోని పసలపూడి, చెల్లూరు పరిసర  గ్రామాలకు జూలై 25వ తేదీ శుక్రవారం ఉదయం 08:00 గం! నుండి మధ్యాహ్నం 01:00 గం!ల వరకు విద్యుత్ సరఫరా లో అంతరాయం ఏర్పడుతుందని, రామచంద్రపురం ఎగ్జిక్యుటివ్ ఇంజనీర్ కె.రత్నాలరావు బుధవారం ప్రకటన ద్వారా తెలిపారు. విద్యుత్ లైన్ల మరమ్మత్తులు, చెట్లుకొమ్మలు తొలగించడం, పసలపూడి సబ్ స్టేషన్ పరిధిలో పసలపూడి రూరల్ ఫీడర్, పసలపూడి ఇండస్ట్రీయల్ ఫీడర్, పసలపూడి టౌన్ ఫీడర్,ల మరమ్మత్తులు,మెయింటనెన్స్ నిమిత్తం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని, వినియోగదారులు గమనించి సహకరించాలని ఆయన ప్రకటన ద్వారా కోరారు.

చెల్లూరు హై స్కూల్ లో “డ్రగ్స్ వద్దు బ్రో” అవగాహన కార్యక్రమం

మాదకద్రవ్యాల మత్తు నిండు జీవితాన్ని నాశనం చేస్తుంది విద్యార్థులు మాదక ద్రవ్యాల పట్ల అవగాహన కలిగి దూరంగా ఉండాలి రాయవరం ఎస్సై డి సురేష్ బాబు విశ్వం వాయిస్ ప్రాంతీయ డెస్క్, రాయవరం మాదక ద్రవ్యాలు మానసిక, శారీరక ఆరోగ్యానికి హాని కలిగించే పదార్థాలని, ఇవి యువతను చెడు మార్గాల వైపు నడిపిస్తూ, చదువులో వెనుకబడే లా చేస్తాయ‌ని రాయవరం ఎస్సై సురేష్ బాబు విద్యార్థులకు తెలిపారు. రాష్ట్ర, జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రాయవరం మండలం, చెల్లూరు గ్రామంలో గల శ్రీ సర్వారాయ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోమవారం "డ్రగ్స్ వద్దు బ్రో" కార్యక్రమం నిర్వహించి, మాదకద్రవ్యాల పట్ల విద్యార్థులకు రాయవరం ఎస్సై సురేష్ బాబు అవగాహన కల్పించారు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...

రాయవరం పోలీస్ స్టేషన్ ను పరిశీలించిన ట్రైనీ డీఎస్పీ

విశ్వం వాయిస్ న్యూస్, రాయవరం డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, మండల కేంద్రమైన రాయవరం పోలీసు స్టేషన్‌ ను ట్రైనీ అడిషనల్ డీఎస్పీ ప్రదీప్తి బుధవారం మండపేట రూరల్ సీఐ పి.దొర రాజు తో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా రికార్డులను పరిశీలించి, పలు కేసుల వివరాలు ఎస్సై సురేష్ బాబు ను అడిగి తెలుసుకున్నారు, పోలీస్ స్టేషన్‌ పరిసరాలను పరిశీలించి, సీజ్‌ చేసిన వాహనాల వివరాలు తెలుసుకున్నారు, స్టేషన్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించి, ప్రజల రక్షణ కొరకు మండలంలో పోలీసులు తీసుకుంటున్న చర్యల వివరాలను తెలుసుకున్నారు. అడిషనల్ డీఎస్పీ ప్రదీప్తి రాకను గమనించి, రాయవరం మండల ఎంపీడీవో కీర్తి స్పందన పోలీస్ స్టేషన్ కు చేరుకుని, మర్యాదపూర్వకంగా...

ప్రైవేటు పాఠశాలల్లో ఉచిత సీటు పొందిన విద్యార్థులకు అందనున్న తల్లికి వందనం

విద్యాశాఖాధికారుల తనిఖీల అనంతరం అందనున్న సంక్షేమం పాఠశాల యాజమాన్య ఖాతాలో రూ.6500, తల్లి ఖాతాలో రూ.6500 జమ వివరాలు వెల్లడించిన ఎంఈఓ సూర్యనారాయణ విశ్వం వాయిస్ న్యూస్, రాయవరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తల్లికి వందనం సంక్షేమ పథకంలో భాగంగా ప్రతి విద్యార్థికి ఈ పథకం వర్తింప చేస్తూ, ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్న ప్రతి విద్యార్థి తల్లి ఖాతాలో రూ.13000 జమ చేయగా, ప్రైవేట్ విద్యా సంస్థలలో విద్యాహక్కు చట్టం 12(1)సి ప్రకారం ఉచితంగా సీటు పొందిన విద్యార్థులకు ఆ డబ్బులు జమ కాలేదు. కాగా ప్రస్తుతం వారికి కూడా "తల్లికి వందనం" సంక్షేమ పథకాన్ని అమలు చేస్తూ, విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.6500, పాఠశాల యాజమాన్య ఖాతాల్లో రూ.6500 లను జమ చేయడానికి గానూ,...

తండ్రి పై హత్యాయత్నం కేసులో నిందితునికి రిమాండ్

విశ్వం వాయిస్ ప్రాంతీయ డెస్క్, రాయవరం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, మండల కేంద్రమైన రాయవరంలో తరచుగా తిడుతున్నాడని, తండ్రిపై కోపం పెంచుకొని సుత్తితో పలుమార్లు దాడి చేసిన ఘటనతో హత్యాయత్నం కేసులో, నిందితునిగా ఉన్న రాజరాజేశ్వరి కాలనీకి చెందిన గంటా పవన్ కళ్యాణ్ ను శనివారం అదుపులోకి తీసుకుని, మండపేట రూరల్ సీఐ పి.దొరరాజు పర్యవేక్షణలో దర్యాప్తు చేసి, అనపర్తి జె.ఎఫ్.సి.ఎమ్ మెజిస్ట్రేట్ కోర్టు లో హాజరు పరచగా నిందితుడైన గంటా పవన్ కళ్యాణ్ కు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించినట్లు రాయవరం ఎస్సై సురేష్ బాబు తెలిపారు.

మాచవరం కెనాల్ లో గుర్తు తెలియని మహిళ మృతదేహం

విశ్వం వాయిస్ ప్రాంతీయ డెస్క్, రాయవరం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాయవరం మండలం మాచవరం కెనాల్ కాలువలో గుర్తుతెలియని సుమారుగా 70 సంవత్సరాల వయస్సు గల మహిళ మృతదేహం స్థానికుల సమాచారంతో గుర్తించినట్లు రాయవరం ఎస్సై డి సురేష్ బాబు ప్రకటన ద్వారా తెలిపారు. గోధుమ రంగు చీర, ఎరుపురంగు జాకెట్ మృతురాలు ధరించి ఉందని ఆచూకీ తెలిసినవారు తమను సంప్రదించాలని మృతదేహాన్ని గుర్తించడంలో సోషల్ మీడియా గ్రూప్ ల ద్వారా సమాచారం మృతురాలి కుటుంబానికి అందేలా సహకరించాలని ఎస్సై సురేష్ బాబు కోరారు

ఇష్టాగోష్టి లా సాగిన మండల సర్వసభ్య సమావేశం

పలు శాఖల అధికారులు గైర్హాజరు వెటర్నరీ శాఖలో అనుభవం లేని ఉద్యోగుల వలన సమస్యలు ఎదురవుతున్నాయి సర్వ సభ్య సమావేశం లో ఎమ్మెల్యే వేగుళ్ళ.. విశ్వం వాయిస్ న్యూస్, , రాయవరం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, మండల కేంద్రమైన రాయవరంలో గల మండల ప్రజా పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో, మండల పరిషత్ అధ్యక్షులు నౌడు వెంకటరమణ అధ్యక్షతన నిర్వహించిన సర్వసభ్య సమావేశం సజావుగా సాగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్, మండపేట శాసనసభ్యులు వేగుళ్ల జోగేశ్వరరావు, మండపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చింతపల్లి రామకృష్ణ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు, కార్యక్రమంలో ఆయా శాఖల అధికారులు తమ తమ శాఖల ద్వారా మండల అభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి అందిస్తున్న సేవలను...
For Ads
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

తాజా వార్తలు

✅ Message cleared
Left Ad
Right Ad
Logo