ePaper
Monday, May 18, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్కోటిపల్లి రాజరాజేశ్వరి స్వామి ఆలయం వద్ద సత్యం

కోటిపల్లి రాజరాజేశ్వరి స్వామి ఆలయం వద్ద సత్యం

📰 Generate e-Paper Clip

వాసంశెట్టి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ

కె.గంగవరం:*(విశ్వం వాయిస్ న్యూస్)

డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం కె.గంగవరం మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కోటిపల్లి గ్రామంలో వెలిసిన శ్రీ రాజరాజేశ్వరి సమేత ఛాయా సోమేశ్వర స్వామి ఆలయం వద్ద సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ ఆధ్వర్యంలో భక్తులకు, ప్రజలకు చల్లని మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు వేసవి తీవ్రత రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజల దాహార్తిని తీర్చాలనే సంకల్పంతో గత ఐదు రోజులుగా ఈ కార్యక్రమాన్ని నిరంతరాయంగా కొనసాగిస్తున్నారు.

ఈ సందర్భంగా స్థానిక నాయకులు గొడవర్తి రామకృష్ణ చౌదరి, వెంటూరి వీర రాఘవ చౌదరిలు మాట్లాడుతూ సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ అధినేత వాసంశెట్టి సత్యం, రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్‌ల నేతృత్వంలో ఈ సేవా కార్యక్రమం జరుగుతోందని తెలిపారు. “సేవే పరమో ధర్మః” అనే భావనతో సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు నిర్వహించడమే ఫౌండేషన్ ప్రధాన లక్ష్యమని వారు పేర్కొన్నారు. ఎండల తీవ్రతతో అల్లాడుతున్న ప్రజలకు, ఆలయానికి వచ్చే భక్తులకు, ప్రయాణికులకు ఈ చల్లని మజ్జిగ ద్వారా కొంత ఉపశమనం కలిగించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ప్రజల కష్టసుఖాల్లో భాగస్వామ్యం అవుతూ సేవా కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తున్న వాసంశెట్టి సత్యం, మంత్రి సుభాష్‌ల సేవా భావాన్ని స్థానికులు, భక్తులు వేనోళ్లా ప్రశంసిస్తూ అభినందనలు తెలియజేసారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -spot_img
error: Content is protected !!