ePaper
Wednesday, September 30, 2026
ePaper
Homeఎడిటోరియల్గంగవరం జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏకగ్రీవంగా స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీ ఎన్నిక

గంగవరం జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏకగ్రీవంగా స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీ ఎన్నిక

📰 Generate e-Paper Clip

గంగవరం జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారం స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీ (ఎస్.ఎమ్.సి ) ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించారు. పాఠశాలలో మొత్తం 252 మంది ఓటర్లు ఉండగా, ఎన్నికల ప్రక్రియకు 185 మంది తల్లిదండ్రులు హాజరయ్యారు. వారి సమక్షంలో ఎస్.ఎమ్.సి సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.చైర్‌పర్సన్‌గా తుమ్మూరి లలిత, వైస్ చైర్‌పర్సన్‌గా దూడల సత్య శ్రీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.ఎన్నికైన ఎస్.ఎమ్.సి సభ్యులు పాఠశాల అభివృద్ధికి తమ వంతు సహకారం అందిస్తామని ప్రతిజ్ఞ చేశారు. ముఖ్యంగా పాఠశాలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేయడం, విద్యార్థినీ విద్యార్థులు సక్రమంగా పాఠశాలకు హాజరయ్యేలా తల్లిదండ్రులతో సమన్వయం చేయడం, అలాగే ఎక్కువ మంది విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించేలా కృషి చేయడం తమ ప్రధాన లక్ష్యాలని తెలిపారు.ఎన్నికల అనంతరం నిర్వహించిన మొదటి ఎస్.ఎమ్.సి సమావేశంలో పాఠశాల అభివృద్ధి, విద్యార్థుల హాజరు శాతం పెంపు, ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల ప్రవేశాలను పెంచడం, అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన తదితర అంశాలపై చర్చించి, వాటికి సంబంధించిన ప్రణాళికలను రూపొందించి తీర్మానాలు చేశారు.ఈ ఎన్నికల ప్రక్రియకు స్వర్ణ గ్రామ వార్డు సెక్రటరీ కె. గంగవరం స్పెషల్ ఆఫీసర్‌గా వ్యవహరించారు. విద్యాశాఖ తరఫున ఇన్‌క్లూజివ్ ఎడ్యుకేషన్ కోఆర్డినేటర్ సత్యనారాయణ హాజరయ్యారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు జి.వి.ఎస్ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ, నూతనంగా ఎన్నికైన ఎస్.ఎమ్.సి సభ్యుల సహకారంతో పాఠశాల అభివృద్ధికి మరింత ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తామని తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -spot_img