✍️ విలేకరి: K Sunil John (కాకినాడ అర్బన్, ఆంధ్రప్రదేశ్)
దక్షిణ ఒడిశాలోని గోపాల్పూర్ సమీపంలో ‘అక్వాన్’ తుపాను కేంద్రీకృతమై ఉంది. ఒడిశా మీదుగా పయనిస్తున్న ఈ తుపాను రాబోయే 3 గంటల్లో తీవ్ర వాయుగుండంగా బలహీనపడే అవకాశం ఉంది. ఆ తర్వాతి 6 గంటల్లో ఇది మరింత బలహీనపడి వాయుగుండంగా మారనుందని ఆర్టీజీఎస్ – ఏపీఎస్డీఎంఏ (20-11-2026, ఉదయం 11 గంటలకు) వెల్లడించింది. తుపాను సంబంధిత సమస్యల పరిష్కారం కోసం ప్రజలు ‘మనమిత్ర’ వాట్సాప్ సేవలను వినియోగించుకోవాలని అధికారులు తెలిపారు. ఇందుకోసం 9552300009 నంబర్‌కు వాట్సాప్ ద్వారా సంప్రదించాలని ఏపీఎస్డీఎంఏ ఎండీ, ఆర్టీజీఎస్ సీఈవో ప్రఖర్ జైన్ సూచించారు.

