✍️ విలేకరి: K Sunil John (రాయవరం, తూర్పు గోదావరి)
రాయవరంలో జోరుగా ప్రారంభమైన నామినేషన్ల పర్వం
రాయవరం: సోమేశ్వరం గ్రామపంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా శాకా రామలక్ష్మి నామినేషన్ దాఖలు చేసేందుకు రాయవరం ఎంపీడీవో కార్యాలయానికి భారీగా ప్రజలు తరలివచ్చారు. గ్రామంలో జరిగిన ఏకగ్రీవ తీర్మానం నేపథ్యంలో ఆమెకు మద్దతుగా పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. నిబంధనల ప్రకారం అభ్యర్థితో ఇద్దరినే లోపలికి అనుమతించడంతో మిగిలిన మద్దతుదారులు ప్రధాన రహదారిపై వేచి ఉండటంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. పోలీసులు ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు.

