ePaper
Tuesday, November 17, 2026
ePaper
Homeఎడిటోరియల్రెండో విడత పంచాయతీ ఎన్నికలకు షెడ్యూల్ ఖరారు

రెండో విడత పంచాయతీ ఎన్నికలకు షెడ్యూల్ ఖరారు

📰 Generate e-Paper Clip

రాయవరం (మండలం), East Godavari (VISWAM VOICE DESK):

  • 18న నోటిఫికేషన్.. 20 వరకు నామినేషన్లు
  • 21న పరిశీలన.. 24న ఉపసంహరణకు గడువు
  • 29న పోలింగ్.. అదే రోజు ఓట్ల లెక్కింపు

 

గ్రామ పంచాయతీ ఎన్నికలు–2026లో భాగంగా రెండో విడత ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఈ మేరకు ఈ నెల 18న ఎన్నికల నోటీసు జారీ చేసి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ నెల 18 నుంచి 20వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. 20న సాయంత్రం 5 గంటలతో నామినేషన్ల స్వీకరణ గడువు ముగియనుంది. 21న ఉదయం 8 గంటల నుంచి నామినేషన్ల పరిశీలన చేపట్టనున్నారు. తిరస్కరించిన నామినేషన్లపై అప్పీళ్లకు 22వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు అవకాశం కల్పించారు. అప్పీళ్ల పరిష్కార ప్రక్రియను 23న పూర్తి చేయనున్నారు. 24న మధ్యాహ్నం 3 గంటల వరకు అభ్యర్థిత్వాలను ఉపసంహరించుకునే అవకాశం ఉంటుంది. అనంతరం అదే రోజు మధ్యాహ్నం 3 గంటల తర్వాత పోటీ చేసే అభ్యర్థుల తుది జాబితాను ప్రకటించనున్నారు. నవంబర్ 29న ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. అదే రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. లెక్కింపు పూర్తయిన వెంటనే ఫలితాలను ప్రకటించనున్నారు. రెండో విడత ఎన్నికల షెడ్యూల్ వెలువడటంతో గ్రామాల్లో రాజకీయ సందడి మరింత ఊపందుకోనుంది.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -spot_img