✍️ విలేకరి: K Sunil John (రాయవరం, కాకినాడ)
రాయవరం శ్రీ రామయ్య జడ్పీ ఉన్నత పాఠశాలలో ఏర్పాటుచేసిన పంచాయితీ ఎన్నికల మెటీరియల్ పంపిణీ కేంద్రంలో శానిటేషన్ చేయకపోవడంపై డివిజనల్ డెవలప్మెంట్ అధికారి పి. వీణాదేవి ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్ద ఎత్తున ఎన్నికల సిబ్బంది చేరుకుంటున్నారన్న విషయం మీకు తెలియదా.. నిర్వహణలో ఇంత నిర్లక్ష్యంగా ఎందుకు వ్యవహరించారంటూ ఆమె సెక్రటరీ సుధారాణిపై అసహనం వ్యక్తం చేశారు. విధి నిర్వహణలో సెక్రటరీ సుధారాణి చూపిన నిర్లక్ష్యంపై మెమో జారీ చేస్తామని, శాఖాపరమైన చర్యలకు ఉన్నతాధికారులకు సిఫార్ చేస్తానని వీణాదేవి విలేకరులకు తెలిపారు.

