ePaper
Tuesday, November 24, 2026
ePaper
Homeస్పోర్ట్స్రేపటి నుంచి రామచంద్రపురంలో రాష్ట్రస్థాయి బాస్కెట్‌బాల్ పోటీలు

రేపటి నుంచి రామచంద్రపురంలో రాష్ట్రస్థాయి బాస్కెట్‌బాల్ పోటీలు

📰 Generate e-Paper Clip

RAMACHANDRAPURAM (RAMACHANDRAPURAM), Dr. B.R. Ambedkar Konaseema (VISWAM VOICE DESK):

స్థానిక శ్రీ కృత్తివెంటి పేర్రాజు పంతులు ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడా ప్రాంగణంలో ఈ నెల 25వ తేదీ నుంచి 28వ తేదీ వరకు నాలుగు రోజులపాటు 12వ ఆంధ్రప్రదేశ్ అంతర్ జిల్లాల సీనియర్ పురుషుల, మహిళల బాస్కెట్‌బాల్ పోటీలు నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని బాస్కెట్‌బాల్ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్నమని చక్రవర్తి మంగళవారం వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ బాస్కెట్‌బాల్ సంఘం, రామచంద్రపురం బాస్కెట్‌బాల్ సంఘం, కోనసీమ బాస్కెట్‌బాల్ సంఘం, భారత బాస్కెట్‌బాల్ సమాఖ్య సంయుక్త ఆధ్వర్యంలో ఈ పోటీలు జరగనున్నాయి. ఈ పోటీల్లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులతో రాష్ట్ర పురుషుల, మహిళల జట్లను ఎంపిక చేయనున్నారు. ఎంపికైన జట్లు డిసెంబర్ 20 నుంచి 28వ తేదీ వరకు మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్‌లో నిర్వహించే 72వ జాతీయ సీనియర్ బాస్కెట్‌బాల్ పోటీల్లో పాల్గొంటాయి. రామచంద్రపురంలో నిర్వహించే ఈ రాష్ట్రస్థాయి పోటీల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాల నుంచి పురుషుల, మహిళల జట్లు పాల్గొంటాయని గన్నమని చక్రవర్తి తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -spot_img