ePaper
Tuesday, November 24, 2026
ePaper
Homeతూర్పుగోదావరిప్రియమిత్ర సంఘం ఆధ్వర్యంలో విద్యార్థులకు విద్యా సహాయం....

ప్రియమిత్ర సంఘం ఆధ్వర్యంలో విద్యార్థులకు విద్యా సహాయం….

📰 Generate e-Paper Clip

Mandapeta (Mandapeta), East Godavari (VISWAM VOICE DESK):

164 మంది విద్యార్థులకు యూనిఫామ్స్, కంప్యూటర్ ల్యాబ్‌కు మూడు కంప్యూటర్లు అందజేత….

స్నేహబంధాన్ని సేవాబంధంగా మలుచుకుంటూ ప్రియమిత్ర సంఘం మరోసారి తన సేవా స్ఫూర్తిని చాటుకుంది. 1987–88లో మండపేటలో పదవ తరగతి చదువుకున్న పూర్వ విద్యార్థులతో ఏర్పాటైన ఈ సంఘం ఆధ్వర్యంలో మంగళవారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యా సహాయ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా 164 మంది విద్యార్థులకు యూనిఫామ్స్, కంప్యూటర్ ల్యాబ్‌కు మూడు కంప్యూటర్ సిస్టమ్స్, పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ఐదు పుస్తక సెట్లు అందజేశారు. కార్యక్రమానికి మున్సిపల్ చైర్‌పర్సన్ వేగుళ్ల అజయ్ బాబు ముఖ్య అతిథిగా, కమిషనర్ టి. రంగారావు విశిష్ట అతిథిగా హాజరయ్యారు.గతంలో బోన్ క్యాన్సర్‌తో బాధపడుతున్న చిన్నారికి రూ.1,30,555, అనారోగ్యంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న బాల్యమిత్రుడికి రూ.1,51,000 ఆర్థిక సహాయం అందించడంతో పాటు, ప్రతిభావంతులైన విద్యార్థులకు పురస్కారాలు, విజయవాడ వరద బాధితులకు రూ.30 వేల విరాళం అందించారు.ఈ సందర్భంగా విఠల్ విద్యార్థులకు స్ఫూర్తిదాయక ప్రసంగం చేశారు. కార్యక్రమంలో ప్రియమిత్ర సంఘ సభ్యులు, కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -spot_img