ePaper
Tuesday, November 24, 2026
ePaper
Homeఎడిటోరియల్ద్రాక్షారామంలో ఎరువుల విక్రయ విధానంపై వ్యాపారులకు శిక్షణ కార్యక్రమం

ద్రాక్షారామంలో ఎరువుల విక్రయ విధానంపై వ్యాపారులకు శిక్షణ కార్యక్రమం

📰 Generate e-Paper Clip

Draksharama (RAMACHANDRAPURAM), Dr. B.R. Ambedkar Konaseema (VISWAM VOICE DESK):

ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ, కేంద్ర రసాయనాలు మరియు ఎరువుల మంత్రిత్వ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా, రామచంద్రపురం మండలం ద్రాక్షారామం రైతు సేవా కేంద్రంలో ఎరువుల విక్రయ విధానంపై ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎరువుల వ్యాపారులు, సహకార సంఘాల ముఖ్య కార్యనిర్వహణ అధికారులు, సిబ్బంది మరియు టోకు వ్యాపారులకు నూతన ఎరువుల విక్రయ విధానం, పారదర్శక పంపిణీ, సాంకేతిక నిర్వహణపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి రామచంద్రపురం వ్యవసాయ సహాయ సంచాలకులు బి. నాగ్ కుమార్, మండల వ్యవసాయ అధికారి టి.వి.ఆర్. మణిదీప్ హాజరయ్యారు. ఎరువుల వ్యాపారులు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల సిబ్బంది, టోకు వ్యాపారులు పాల్గొన్నారు. రైతులకు అవసరమైన ఎరువులను సకాలంలో, సరిపడా పరిమాణంలో సులభంగా, పారదర్శకంగా అందించేందుకు ఈ శిక్షణ కార్యక్రమం ఎంతగానో దోహదపడుతుందని వ్యవసాయ అధికారులు తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -spot_img