ePaper
Tuesday, November 24, 2026
ePaper
Homeఎడిటోరియల్ఎన్డీఏ కూటమి పాలనపై ప్రజల్లో అచంచలమైన విశ్వాసం

ఎన్డీఏ కూటమి పాలనపై ప్రజల్లో అచంచలమైన విశ్వాసం

📰 Generate e-Paper Clip

కాకినాడ కార్పొరేషన్ పీఠం కూటమిదే..

31వ వార్డులో మంత్రి వాసంశెట్టి సుభాష్ విస్తృత ఇంటింటి ప్రచారం

కాకినాడ నగరపాలక సంస్థ (కార్పొరేషన్) పీఠాన్ని ఎన్డీఏ కూటమి కైవసం చేసుకోవడం ఖాయమని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నాయకత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ప్రజల్లో విశేషమైన ఆదరణ, నమ్మకం ఉందని పేర్కొన్నారు. ఈరోజు కాకినాడ నగరంలోని 31వ వార్డులో ఎన్డీఏ కూటమి అభ్యర్థి పాలిక సీతామహాలక్ష్మి నాని తరఫున మంత్రి వాసంశెట్టి సుభాష్ విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి ఓటర్లను కలుసుకుంటూ కూటమి అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కూటమి ప్రభుత్వ ప్రజా సంక్షేమ పాలనను, భవిష్యత్తులో చేపట్టనున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా మంత్రి సుభాష్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ ముందుకు సాగుతోందన్నారు. పేదల సంక్షేమం, మహిళా సాధికారత, యువతకు ఉపాధి, మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని తెలిపారు. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికలు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు ప్రజలు అందించిన విజయాలే ప్రభుత్వంపై ఉన్న విశ్వాసానికి నిదర్శనమని అన్నారు. ప్రజలు అభివృద్ధి, సంక్షేమాన్ని కోరుకుంటున్నారని, కూటమి పాలనకు మరోసారి తమ మద్దతు తెలియజేస్తున్నారని పేర్కొన్నారు. కాకినాడ నగర అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ప్రజలకు మెరుగైన రహదారులు, పారిశుద్ధ్యం, తాగునీరు, మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ప్రజల సమస్యలను తెలుసుకుంటూ, వాటి పరిష్కారానికి నిరంతరం అందుబాటులో ఉండే నాయకత్వానికి ప్రజలు పట్టం కట్టాలని కోరారు.కాకినాడ కార్పొరేషన్‌లో ఎన్డీఏ కూటమి విజయమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు సమష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు. 31వ వార్డులో పాలిక సీతామహాలక్ష్మి నాని విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు.ఈ ఎన్నికల్లో ప్రజల ఆశీర్వాదంతో కాకినాడ కార్పొరేషన్‌పై ఎన్డీఏ కూటమి జెండా ఎగురవేస్తామని మంత్రి వాసంశెట్టి సుభాష్ ధీమా వ్యక్తం చేశారు.ఈ ప్రచార కార్యక్రమంలో మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు, రామచంద్రపురం మున్సిపల్ చైర్మన్ మేడిశెట్టి శేషారావు, టిడిపి జిల్లా సెక్రెటరీ పెంకే సాయిబాబా యనమదల రవి, గ్రంధి బాబ్జి, అనసూయ సతీష్ స్థానిక కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -spot_img