ePaper
Saturday, August 29, 2026
ePaper
HomeCRIME VOICEరామచంద్రపురంలో విషాదం.. ఉరివేసుకుని ఫార్మా కంపెనీ ఉద్యోగి ఆత్మహత్య

రామచంద్రపురంలో విషాదం.. ఉరివేసుకుని ఫార్మా కంపెనీ ఉద్యోగి ఆత్మహత్య

📰 Generate e-Paper Clip

రామచంద్రపురం : విశ్వం వాయిస్ న్యూస్ ​

రామచంద్రపురం పట్టణంలో ఓ విషాద ఘటన జరిగింది. పట్టణంలోని 8వ వార్డు అంకంవారి వీధికి చెందిన కొప్పిశెట్టి వెంకటేష్ (27) అనే యువకుడు తన ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. హైదరాబాద్‌లోని ఓ ఫార్మా కంపెనీలో ఉద్యోగం చేస్తున్న వెంకటేష్, నాలుగు రోజుల క్రితమే ఊరికి వచ్చాడు. ఆగస్టు 27 రాత్రి స్థానికంగా జరిగిన పండుగకు వెళ్లాడు. అక్కడ ఎవరో వ్యక్తితో ఫోన్‌లో మాట్లాడిన తర్వాత తెల్లవారుజామున ఇంటికి తిరిగి వచ్చాడు. మరుసటి రోజు ఆగస్టు 28 ఉదయం 7 గంటల సమయంలో తండ్రి కొప్పిశెట్టి రాజు కుమారుడి గదికి వెళ్లి చూసేసరికి.. వెంకటేష్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని చనిపోయి ఉన్నాడు. కొడుకు మరణంపై తండ్రి రాజు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం రామచంద్రపురం పోలీసులు కేసు నమోదు చేశారు. Cr.No.133/2026 U/s 194 BNSS కింద కేసు ఫైల్ చేసి విచారణ మొదలుపెట్టినట్లు ఎస్సై చెప్పారు. అసలు వెంకటేష్ ఫోన్‌లో ఎవరితో మాట్లాడాడు, ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -spot_img