ePaper
Thursday, September 17, 2026
ePaper
HomeBUSINESS VOICEద్రాక్షారామలో ఘనంగా స్టేట్ బ్యాంక్ నూతన బ్రాంచీ ప్రారంభోత్సవం

ద్రాక్షారామలో ఘనంగా స్టేట్ బ్యాంక్ నూతన బ్రాంచీ ప్రారంభోత్సవం

📰 Generate e-Paper Clip

RAMACHANDRAPURAM, Dr. B.R. Ambedkar Konaseema (VISWAM VOICE DESK):

డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని చారిత్రక పుణ్యక్షేత్రమైన ద్రాక్షారామలో ఇటీవల ఆధునిక హంగులతో నవీకరించిన భారతీయ స్టేట్ బ్యాంకు (ఎస్బీఐ) బ్రాంచీని అమరావతి సర్కిల్ నెట్‌వర్క్ 1 జనరల్ మేనేజరు ప్రపుల్ల కుమార్ జెనా బుధవారం అట్టహాసంగా ప్రారంభించారు.

ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన జనరల్ మేనేజరు ప్రపుల్ల కుమార్ జెనాకు బ్రాంచీ సిబ్బంది ఘన స్వాగతం పలికారు. కొత్తగా రూపుదిద్దుకున్న ఈ బ్రాంచీని అందమైన పూలతో, ఆకర్షణీయంగా ముస్తాబు చేయడంతో బ్యాంకు ప్రాంగణమంతా సందడిగా మారింది.

ఈ కార్యక్రమంలో రాజమహేంద్రవరం పరిపాలన కార్యాలయ డిప్యూటీ జనరల్ మేనేజరు పంకజ్ కుమార్, కాకినాడ రీజియన్ 4 రీజినల్ మేనేజరు ఎం.వి.వి.ఎం. కృష్ణ ప్రత్యేక అతిథులుగా హాజరయ్యారు. బ్రాంచి మేనేజరు యు. వెంకటరమణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో బ్యాంకు సిబ్బంది మరియు స్థానిక ఖాతాదారులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ వేడుకను విజయవంతం చేశారు. నవీకరించబడిన ఈ బ్రాంచీ ద్వారా స్థానిక ప్రజలకు మరింత మెరుగైన, వేగవంతమైన డిజిటల్ మరియు బ్యాంకింగ్ సేవలు అందుబాటులోకి రానున్నాయని అధికారులు తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -spot_img