ePaper
Thursday, September 17, 2026
ePaper
HomeHEALTH VOICEరామచంద్రపురం మోడరన్ డిగ్రీ కాలేజీలో హెచ్‌ఐవీ/ఎయిడ్స్‌పై అవగాహన సదస్సు

రామచంద్రపురం మోడరన్ డిగ్రీ కాలేజీలో హెచ్‌ఐవీ/ఎయిడ్స్‌పై అవగాహన సదస్సు

📰 Generate e-Paper Clip

RAMACHANDRAPURAM, Dr. B.R. Ambedkar Konaseema (VISWAM VOICE DESK):

డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం మోడరన్ డిగ్రీ కాలేజీలో దిశా / జనకళ్యాణ్ వెల్ఫేర్ సొసైటీ, అమలాపురం వారి ఆధ్వర్యంలో విద్యార్థుల కోసం హెచ్‌ఐవీ/ఎయిడ్స్‌పై ఇంటెన్సిఫైడ్ ఐ.ఇ.సి క్యాంపెయిన్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ సూచనలతో డిస్ట్రిక్ట్ ఇంటిగ్రాటెడ్ స్ట్రాటెజీ ఫర్ హెచ్‌ఐవీ/ఎయిడ్స్ (దిశా) ఆధ్వర్యంలో కళాశాల ప్రిన్సిపాల్ పి. వెంకటేశ్వర్లు అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన దిశా అమలాపురం క్లస్టర్ ప్రివెన్షన్ ఆఫీసర్ జి. రామానాయుడు మాట్లాడుతూ, సమిష్టి అవగాహన మరియు సరైన చికిత్స ద్వారా హెచ్‌ఐవీని నివారించవచ్చని తెలిపారు. అంతేకాకుండా హెచ్‌ఐవీ/ఎయిడ్స్ వ్యాపించే విధానాలు, నివారణ మార్గాలు, చికిత్స విధానాలు మరియు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. అనుమానాల నివృత్తి కొరకు 1097 టోల్ ఫ్రీ నంబర్‌ను సంప్రదించాలని సూచించారు. అనంతరం ఏపీసాక్స్ ముద్రించిన ఐ.ఇ.సి మెటీరియల్‌ను విద్యార్థులకు అందజేశారు.

  1. ఈ కార్యక్రమంలో మోడరన్ డిగ్రీ కాలేజీ అధ్యాపక బృందం, జనకళ్యాణ్ వెల్ఫేర్ సొసైటీ ప్రివెన్షన్ యూనిట్ ప్రాజెక్ట్ మేనేజర్ జి. శ్రీను, ఔట్రీచ్ వర్కర్ ఆలపాటి దొరబాబు, పీర్ ఎడ్యుకేటర్ గెడ్డం లక్ష్మి మరియు అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు
RELATED ARTICLES

Most Popular

- Advertisment -spot_img