ePaper
Saturday, September 19, 2026
ePaper
Homeఎడిటోరియల్ద్రాక్షారామలో ఘనంగా 25 ఏళ్లు సేవా సంకల్ప్ అభియాన్ మరియు ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన...

ద్రాక్షారామలో ఘనంగా 25 ఏళ్లు సేవా సంకల్ప్ అభియాన్ మరియు ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన వేడుకలు ​

📰 Generate e-Paper Clip

RAMACHANDRAPURAM, Dr. B.R. Ambedkar Konaseema (VISWAM VOICE DESK):

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా

రామచంద్రపురం మండలం ద్రాక్షారామలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకొని నిర్వహిస్తున్న 25 ఏళ్లు సేవా సంకల్ప్ అభియాన్ కార్యక్రమాల్లో భాగంగా సేవా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. మండల బీజేపీ అధ్యక్షులు ఆకేటి శ్రీకృష్ణ ఆధ్వర్యంలో, సేవా సంకల్ప్ అభియాన్ జిల్లా కన్వీనర్, బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి నాగిరెడ్డి సతీష్ రావు సమన్వయంతో ఈ కార్యక్రమాలు కొనసాగాయి.

​ద్రాక్షారామలోని పార్టీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన ప్రధాని నరేంద్ర మోదీ అభివృద్ధి, సంక్షేమ పథకాల ఎగ్జిబిషన్‌ను ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర మంత్రి వాసంశెట్టి సుభాష్ తండ్రి, సత్యం ఫౌండేషన్ అధినేత వాసంశెట్టి సత్యం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వాసంశెట్టి సత్యం మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు విస్తృతంగా కొనసాగుతున్నాయని, దేశాభివృద్ధికి మోదీ నాయకత్వం ఎంతగానో దోహదపడుతోందని పేర్కొంటూ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వాసంశెట్టి సత్యం, బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కర్రి చిట్టిబాబు బిజెపి నేతలతో కలిసి కేక్ కట్ చేశారు.

​ఎగ్జిబిషన్‌లో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, రైతులు, మహిళలు, యువత, పేదలు మరియు వివిధ వర్గాల ప్రజలకు అందుతున్న ప్రయోజనాలను ఆకేటి శ్రీకృష్ణ ప్రజలకు వివరించారు. విచ్చేసిన అతిథులకు మోదీ అందిస్తున్న కేంద్ర ప్రభుత్వ పథకాల బుక్ లెట్ లను బిజెపి నాయకులు అవసరాల వీరవెంకట రమణ మూర్తి, గుర్రాల సత్యనారాయణ, చందు, కొట్టువాడ హరిబాబు, సలాది సతీష్ నాయుడు, గాణాల కళ్యాణ్, రాజేశ్వరి, రాయుడు రామకృష్ణ తదితరులు అందజేశారు.

​విశ్వకర్మ జయంతి సందర్భంగా వారి చిత్ర పటానికి పూల మాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ముఖ్య అతిథులు వాసంసెట్టి సత్యం, పెంకే అన్నపూర్ణ సాంబశివరావు, కొత్తపల్లి అరుణ రాంబాబు తదితరులను ఆకేటి శ్రీకృష్ణ ఘనంగా సత్కరించారు. సాయంత్రం శ్రీ మాణిక్యాంబ సమేత భీమేశ్వరస్వామి వారి ఆలయంలో ప్రధాని మోదీ సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలని ఆశీర్వాద దీపాలు వెలిగించారు. ఈ కార్యక్రమంలో పుల్లెల రామమూర్తి, అయ్యప్ప, పద్మావతి, సుజాత, ఇంధన సత్యనారాయణ, దక్షిణా మూర్తి, తొలేటి సూర్య, ఆళ్ల నారాయణ తదితర బీజేపీ కూటమి నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -spot_img