ప్రపంచ ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ శుభాకాంక్షలు
ప్రపంచ ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులందరికీ రాష్ట్ర కార్మిక శాఖా మంత్రి వాసంశెట్టి సుభాష్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. నవ సమాజ నిర్మాణంలో,విద్యార్థులలో నైతిక విలువలు నూరిపోస్తూ వారిని క్రమశిక్షణ కలిగిన పౌరులుగా మార్చడంలో ఉపాధ్యాయులు కీలక పాత్ర పోషిస్తున్నారని కొనియాడారు.ఈ సందర్భంగా మంత్రి వాసంశెట్టి సుభాష్ మాట్లాడుతూ సమాజంలో మార్పునకు, పురోగతికి మూలస్తంభాలు ఉపాధ్యాయులే. అజ్ఞానమనే చీకట్లను పారద్రోలి, విజ్ఞాన దీపాలు వెలిగించే గురువుల సేవలు వెలకట్టలేనివి. మారుతున్న కాలానికి అనుగుణంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూ విద్యార్థులను ప్రపంచస్థాయి పోటీకి సిద్ధం చేస్తున్న మన ఉపాధ్యాయుల కృషి ఎంతో అభినందనీయం. మన ప్రభుత్వం విద్యా మరియు శ్రామిక రంగా పురోగతికి అత్యున్నత ప్రాధాన్యత ఇస్తోంది. పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనతో పాటు ఉపాధ్యాయులు, కార్మికులు మరియు వారి కుటుంబాల సంక్షేమానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఉపాధ్యాయ లోకానికి నా అభినందనలు తెలుపుతూ, వారి ఆశయ సాధనకు అందరం అండగా నిలుద్దామని పిలుపు నిచ్చారు.భావి తరాలను ప్రయోజకులుగా తీర్చిదిద్దుతున్న ఉపాధ్యాయులందరికీ మరోసారి ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.

