ePaper
Friday, November 20, 2026
ePaper
Homeఎడిటోరియల్బలహీనపడనున్న 'అక్వాన్' తుపాను.. 'మనమిత్ర' వాట్సాప్ నంబర్ విడుదల

బలహీనపడనున్న ‘అక్వాన్’ తుపాను.. ‘మనమిత్ర’ వాట్సాప్ నంబర్ విడుదల

📰 Generate e-Paper Clip

✍️ విలేకరి: K Sunil John (కాకినాడ అర్బన్, ఆంధ్రప్రదేశ్)

దక్షిణ ఒడిశాలోని గోపాల్‌పూర్ సమీపంలో ‘అక్వాన్’ తుపాను కేంద్రీకృతమై ఉంది. ఒడిశా మీదుగా పయనిస్తున్న ఈ తుపాను రాబోయే 3 గంటల్లో తీవ్ర వాయుగుండంగా బలహీనపడే అవకాశం ఉంది. ఆ తర్వాతి 6 గంటల్లో ఇది మరింత బలహీనపడి వాయుగుండంగా మారనుందని ఆర్టీజీఎస్ – ఏపీఎస్డీఎంఏ (20-11-2026, ఉదయం 11 గంటలకు) వెల్లడించింది. తుపాను సంబంధిత సమస్యల పరిష్కారం కోసం ప్రజలు ‘మనమిత్ర’ వాట్సాప్ సేవలను వినియోగించుకోవాలని అధికారులు తెలిపారు. ఇందుకోసం 9552300009 నంబర్‌కు వాట్సాప్ ద్వారా సంప్రదించాలని ఏపీఎస్డీఎంఏ ఎండీ, ఆర్టీజీఎస్ సీఈవో ప్రఖర్ జైన్ సూచించారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -spot_img