ePaper
Tuesday, November 24, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్విద్యార్థులకు ఎలక్టోరల్ లిటరసీ క్లబ్స్ ఆధ్వర్యంలో క్విజ్ పోటీలు...

విద్యార్థులకు ఎలక్టోరల్ లిటరసీ క్లబ్స్ ఆధ్వర్యంలో క్విజ్ పోటీలు…

📰 Generate e-Paper Clip

Mandapeta (Mandapeta), East Godavari (VISWAM VOICE DESK):

ఓటు హక్కు, ఎన్నికల ప్రక్రియపై అవగాహన కల్పించడమే లక్ష్యం…

మండపేటలోని వేగుళ్ల సూర్యారావు ప్రభుత్వజూనియర్ కళాశాలలో నిర్వహణ…

జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆదేశాల మేరకు మండపేట అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని మండపేట మండలం, పట్టణంలో ఎలక్టోరల్ లిటరసీ క్లబ్స్ (ఓటరు అక్షరాస్యత క్లబ్బులు) ఆధ్వర్యంలో మంగళవారం క్విజ్ పోటీలు నిర్వహించారు. మండపేట అసెంబ్లీ నియోజకవర్గంలోని వేగుళ్ల సూర్యారావు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో విద్యార్థినీ, విద్యార్థులకు ఎన్నికలు, ఓటు హక్కు, ప్రజాస్వామ్య వ్యవస్థపై అవగాహన కల్పించే ఉద్దేశంతో క్విజ్ పోటీలు నిర్వహించినట్లు ఓటరు నమోదు అధికారి టి.ఆర్. రాజేశ్వరరావు తెలిపారు.ఈ కార్యక్రమంలో సహాయ ఓటరు నమోదు అధికారులు, ఎన్నికల డిప్యూటీ తహశీల్దార్ పి.ఎ. మెహర్ బాబా, టి.పి.ఓ. కె. రమ్య, కళాశాల ప్రిన్సిపాల్ అప్పలరాజు, లెక్చరర్ కృష్ణమ్మ నాయుడు, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -spot_img