ePaper
Tuesday, November 24, 2026
ePaper
Homeక్రైమ్ న్యూస్హత్యాయత్నం కేసులో ఇద్దరి అరెస్ట్....

హత్యాయత్నం కేసులో ఇద్దరి అరెస్ట్….

📰 Generate e-Paper Clip

Mandapeta (Mandapeta), East Godavari (VISWAM VOICE DESK):

మండపేట రూరల్ స్టేషన్ పరిధిలో పాత కక్షల నేపథ్యంలో పుచ్చకాయల శ్రీనివాస్‌పై బీరు సీసాలతో దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడిన దుల్ల అజయ్, వేమగిరి సునీల్‌లను మండపేట రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నెల 23న తాపేశ్వరం బ్రాందీ షాపు సమీపంలో జరిగిన ఈ ఘటనలో శ్రీనివాస్ తీవ్రంగా గాయపడ్డాడు.బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు, రూరల్ సీఐ పి. దొరరాజు పర్యవేక్షణలో ఎస్ఐ వి. కిషోర్ నిందితులను అరెస్ట్ చేసి ఆలమూరు జేఎఫ్‌సీఎం కోర్టులో హాజరుపరిచారు. న్యాయస్థానం వారికి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది.ఈ సందర్భంగా సీఐ దొరరాజు మాట్లాడుతూ ఎన్నికల నేపథ్యంలో ప్రజలు శాంతిభద్రతలకు విఘాతం కలిగించకుండా సంయమనం పాటించాలని సూచించారు. ఇప్పటికే సర్కిల్ పరిధిలో ఫ్లాగ్ మార్చ్‌లు నిర్వహించి, 80 మంది రౌడీషీటర్లతో పాటు గత ఎన్నికల కేసుల్లో ఉన్నవారిని బైండోవర్ చేసినట్లు తెలిపారు. ఓటర్లు ఎలాంటి భయం, ఒత్తిడి, ప్రలోభాలకు లోనుకాకుండా స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -spot_img