RAMACHANDRAPURAM, Dr. B.R. Ambedkar Konaseema (VISWAM VOICE DESK):
డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం హసన్ బాదలో అంగన్వాడీ పోషణ మాసోత్సవాలను శిశు అభివృద్ధి ప్రాజెక్టు అధికారి వి.వి. వరాహలక్ష్మి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి, సేవా సంకల్ప్ అభియాన్ జిల్లా కన్వీనర్, మాజీ సర్పంచ్ నాగిరెడ్డి సతీష్ రావు ముఖ్య అతిథిగా పాల్గొని, అంగన్వాడీ కేంద్రాల ద్వారా ప్రజలకు అందుతున్న సేవలు మరియు మహిళలు, చిన్నారుల సంక్షేమం కోసం ప్రభుత్వం అందిస్తున్న కార్యక్రమాల గురించి వివరించారు. చిన్నారుల ఆరోగ్యం, పోషణ, విద్య అలాగే గర్భిణులు, బాలింతలకు అందుతున్న సేవలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం గర్భిణీ స్త్రీలకు, తల్లులు, పిల్లలకు బాలామృతం, పోషణ ఆహార కిట్లను నాగిరెడ్డి సతీష్ రావు చేతుల మీదుగా అందజేశారు. అంగన్వాడీ సూపర్వైజర్ ఐ. కల్యాణి రిచ్ ప్రోటీన్, పోషణ, మై ప్లేట్ గురించి గర్భిణీ స్త్రీలకు, తల్లులకు అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో అంగన్వాడీ సిబ్బంది పి. చంద్రకళ, కే. లక్ష్మీ జ్యోతి, ఎన్. దుర్గజ్యోతి, పి. లక్ష్మీ, ఏ. పద్మావతి తదితరులు పాల్గొన్నారు. ఆరోగ్య సిబ్బంది ఏ.ఎన్.ఎం వెంకటరమణ ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించగా, ఎం.ఎల్.హెచ్.పి లిదియా, జీ.ఎం.ఎస్.కే. నాగదేవి, ఆశా వర్కర్లు డి. పుష్పలత, పి. నాగలక్ష్మి మరియు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

