ePaper
Sunday, September 20, 2026
ePaper
Homeఎడిటోరియల్ప్రసన్నాంజనేయ స్వామి ఆలయంపై వైసీపీ కుల రాజకీయాలు

ప్రసన్నాంజనేయ స్వామి ఆలయంపై వైసీపీ కుల రాజకీయాలు

📰 Generate e-Paper Clip

మంత్రి సుభాష్‌పై విషపూరిత రాజకీయాలు

కాపు సామాజిక వర్గాన్ని దూరం చేసేందుకే ఈ కుట్రలు

ద్రాక్షారామం శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయ వ్యవహారాన్ని రాజకీయ అంశంగా మార్చి రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్‌పై దుష్ప్రచారం చేస్తున్నారని కూటమి నాయకులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రామచంద్రపురంలోని జనసేన పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఏఎంసీ చైర్మన్ అక్కల రిష్వంత్ రాయ్, జనసేన నియోజకవర్గ ఇన్‌చార్జి పోలిశెట్టి చంద్రశేఖర్, క్లస్టర్-2 ఇన్‌చార్జి కంచుమర్తి బాబురావు మాట్లాడారు.ఏఎంసీ చైర్మన్ అక్కల రిష్వంత్ రాయ్ మాట్లాడుతూ.. శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయంపై మాట్లాడుతున్న ప్రతిపక్ష నాయకుడు పిల్లి సూర్యప్రకాష్ ముందుగా ఈ వ్యవహారానికి సంబంధించి అవగాహనతో అధికారిక రికార్డులను పరిశీలించాలని అన్నారు. 2022లో ధూపదీప నైవేద్యానికి సంబంధించి దేవాదాయ శాఖకు చేసిన అభ్యర్థనల నేపథ్యంలో అప్పటి దేవాదాయ శాఖ కమిషనర్ కార్యాలయం నుంచి ప్రొసీడింగ్స్ వెలువడిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు.File No. COE/880/2022-J, R.Dis.No.J1/880/2022, తేదీ 18-08-2022తో దేవాదాయ శాఖ కమిషనర్ జారీ చేసిన పత్రంలో కొన్ని హిందూ దేవాలయాలు, మత సంస్థలను ఆంధ్రప్రదేశ్ చారిటబుల్ అండ్ హిందూ రిలీజియస్ ఇన్‌స్టిట్యూషన్స్ అండ్ ఎండోమెంట్స్ యాక్ట్, 1987లోని సెక్షన్ 6(c)(ii) కింద ప్రచురించినట్లు ఉందని తెలిపారు.2022లోనే దేవాదాయ శాఖకు సంబంధించిన ప్రక్రియ కొనసాగినప్పుడు అప్పటి ప్రభుత్వంలో ఉన్న వైసీపీ ప్రజాప్రతినిధులు ఈ అంశాన్ని ఎందుకు ప్రశ్నించలేదు? ఇప్పుడు అదే అంశాన్ని తీసుకుని కూటమి ప్రభుత్వాన్ని నిందించడం, మంత్రి సుభాష్ పై విషం కక్కడం ఎందుకు అని రిష్వంత్ రాయ్ ప్రశ్నించారు. ముందు మీ వైసీపీ నాయకులను ప్రశ్నించండన్నారు.జనసేన నియోజకవర్గ ఇన్‌చార్జి పోలిశెట్టి చంద్రశేఖర్ మాట్లాడుతూ.. మంత్రి వాసంశెట్టి సుభాష్‌పై బురదజల్లే ఉద్దేశంతోనే కొంతమంది వైఎస్ఆర్‌సీపీ నాయకులు ఈ ఆలయ అంశాన్ని రాజకీయంగా ఉపయోగిస్తున్నారని ఆరోపించారు.మంత్రి సుభాష్‌కు కాపు సామాజిక వర్గాన్ని దూరం చేయాలనే ఉద్దేశంతోనే ఈ వ్యవహారాన్ని రాజకీయంగా ఉపయోగించేందుకు కుట్రలు జరుగుతున్నాయి అని ఆయన ఆరోపించారు.ఆలయ వ్యవహారంపై అవాస్తవాలు ప్రచారం చేయకుండా అధికారిక పత్రాలను పరిశీలించాలని సూచించారు.ప్రసన్నాంజనేయ స్వామి ఆలయ ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటాం. దేవాలయం భక్తుల విశ్వాసానికి సంబంధించినది.. రాజకీయాలకు వేదిక కాకూడదు అని చంద్రశేఖర్ అన్నారు. క్లస్టర్-2 ఇన్‌చార్జి కంచుమర్తి బాబురావు మాట్లాడుతూ.. ద్రాక్షారామంలోని ప్రసిద్ధ శ్రీ భీమేశ్వరస్వామి ఆలయ పరిసరాలను రాజకీయ వివాదాలకు కేంద్రంగా మార్చడం సరికాదన్నారు.పిల్లి సూర్యప్రకాష్ మిడిమిడి జ్ఞానంతో, అవగాహన లేకుండా ఆలయ వ్యవహారంపై మాట్లాడుతున్నారని విమర్శించారు.మంత్రి వాసంశెట్టి సుభాష్‌కు ప్రజల్లో పెరుగుతున్న ఆదరణ, రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఆయనపై రాజకీయ విమర్శలు చేస్తున్నారని బాబురావు ఆరోపించారు.రామచంద్రపురం నియోజకవర్గంలో కుల, మత, వర్గ విభేదాలు సృష్టించే ప్రయత్నాలు చేసి విఫలం అయ్యారని, పవిత్రమైన దేవాలయాన్ని రాజకీయాలకు ఉపయోగించి,ప్రజల మనోభావాలతో ఆటలాడవద్దు అని తీవ్రంగా మండిపడ్డారు.దేవుని దగ్గర కులాలు ఏంటి? దేవుడు అందరివాడు. దేవుని సన్నిధిలో కులాలు, వర్గాల రాజకీయాలు చేయడం సరికాదు. ఒక పవిత్రమైన ఆలయ అంశాన్ని రాజకీయంగా ఉపయోగించడం వల్ల నియోజకవర్గ ప్రజల్లో అనవసరమైన అపోహలు, విభేదాలు ఏర్పడే అవకాశం ఉంది. దేవుని ముందు అందరూ సమానమే అని అన్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన పరిపాలనా ప్రక్రియలకు సంబంధించిన అంశాలను ప్రస్తుత ప్రభుత్వంపై మోపడం సరికాదని వారు పేర్కొన్నారు.రాజకీయ విభేదాలు ఏవైనా ఉండొచ్చు.. కానీ దేవాలయాల విషయంలో, ప్రజల విశ్వాసాల విషయంలో రాజకీయ నాయకులు బాధ్యతగా వ్యవహరించాలి. రామచంద్రపురం నియోజకవర్గంలో ప్రశాంత వాతావరణాన్ని కలుషితం చేసే రాజకీయాలు వద్దని హితవు పలికారు.ఈ సమావేశంలో పలువురు కూటమి పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -spot_img