RAMACHANDRAPURAM (RAMACHANDRAPURAM), Dr. B.R. Ambedkar Konaseema (VISWAM VOICE DESK):
డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో ఈ నెల 22వ తేదీ ఆదివారం ఖేలో ఇండియా అస్మిత మహిళా లీగ్‌తో పాటు సీనియర్స్ అంతర్ జిల్లా బాస్కెట్‌బాల్ జట్టు ఎంపిక పోటీలు నిర్వహించనున్నారు. రామచంద్రపురం బాస్కెట్‌బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శ్రీ కృత్తివెంటి పేర్రాజు పంతులు క్రీడా ప్రాంగణంలో ఈ పోటీలు జరగనున్నాయి. మహిళా క్రీడాకారులను ప్రోత్సహించడంతో పాటు పురుషులు, మహిళల్లో ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించి తూర్పు గోదావరి జిల్లా బాస్కెట్‌బాల్ జట్టుకు ఎంపిక చేయడం ఈ పోటీల ముఖ్య ఉద్దేశమని అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. ఆసక్తి కలిగిన క్రీడాకారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తమ ప్రతిభను నిరూపించుకోవాలని కోరారు. క్రీడాభిమానులు, క్రీడా సంఘాల ప్రతినిధులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రామచంద్రపురం బాస్కెట్‌బాల్ అసోసియేషన్ విజ్ఞప్తి చేసింది.

